NTV Telugu Site icon

Noida: ఆరో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య.. వీడియో వైరల్

Noida

Noida

ప్రేమ, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు… కారణమేదైనా కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. దేశంలో రోజు రోజుకూ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బలవన్మరణాలకు ఎక్కువగా ఆర్థిక సమస్యలు, ఒత్తిడి భరించలేకపోవడం కారణంగా ఉన్నాయి. తాజాగా నోయిడాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. నోయిడాలో ఒక మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆరో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. టెర్రస్ గోడపై కూర్చున్న ఆ మహిళ అకస్మాత్తుగా కిందకు దూకింది. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్ఫాబాద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని సమాచారం.

READ MORE: Toyota Innova Crysta : టయోటా ఇన్నోవా క్రిస్టా బేసిక్ మోడల్ ధర ఎంత.. ఈఎంఐలో కొంటే ప్రతి నెల ఎంత చెల్లించాలి ?

ఈ వీడియోను ఓ వినియోగదారుడు సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. “నోయిడాలో మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఒక మహిళ 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గత 4 రోజుల్లో, నోయిడా మరియు గ్రేటర్ నోయిడాలో దాదాపు 10 మంది మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారు. సమాజానికి దూరంగా ఉండటం, సోషల్ మీడియాలో బిజీగా ఉండటం మానసిక ఒత్తిడికి కారణమవుతోంది.” అని రాసుకొచ్చాడు.