NTV Telugu Site icon

Crocodile : రోడ్డు దాటుతున్న మొసలి.. సెకనులో తప్పించుకున్న ఉద్యోగి

New Project (4)

New Project (4)

Crocodile : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం తుపానుగా మారింది. తుఫానుకు మిచాంగ్ అని పేరు పెట్టారు. ఇది చెన్నైకి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయువ్య దిశలో పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో తుపాను ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను చెన్నైకి 140 కి.మీ దూరం నుంచి కదులుతుండగా చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో వాయుగుండాలతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది.

Read Also:Nani : ‘బలగం’ వేణు దర్శకత్వంలో నాని కొత్త సినిమా?

దీంతో పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అలాగే చెన్నై శివార్లలోని సరస్సులు నిండిపోవడంతో భద్రత దృష్ట్యా సరస్సుల నుంచి నీటిని విడుదల చేశారు. దీని వల్ల పాములు, క్రిములు బయటకు వస్తాయని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఓ మొసలి రోడ్డు దాటుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

Read Also:AP Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ గ్రామ సచివాలయాల్లో 1,896 ఉద్యోగాలు..

చెన్నై పెరుంగళత్తూరు-నెల్కుకుంరం రహదారిపై ఓ భారీ మొసలి రోడ్డు దాటుతున్న వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రద్దీగా ఉండే ఈ రోడ్డుపై దూకుడుగా వెళ్తున్న మొసలిని ఎవరో కారులోంచి కెమెరాలో బంధించారు. ఫుడ్ డెలివరీ వర్కర్ మొసలిని గమనించకుండా దాటేశాడు. అదృష్టవశాత్తూ ఉద్యోగి ప్రాణాలతో బయటపడ్డాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.