NTV Telugu Site icon

Diamond: రైతు పొలంలో విలువైన వజ్రం లభ్యం.. దాని ధర ఎంతంటే..?

New Project (26)

New Project (26)

కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. దీంతో ఆయన పంట పండింది. వజ్రం విలువైనది కావడంతో చుట్టుపక్కల వ్యాపారస్థులు ఆ రైతు ఇంటికి చేరుకున్నారు. ఆ వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది. వర్షాలు పడటంతో స్థానికులు వజ్రాల వేట మొదలు పెట్టారు. ఓ రైతుకు విలువైన వజ్రం లభించడంతో ఆయన ఇంటికి తీసుకెళ్లారు. దాన్ని పరీక్షించే లోపే వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. వజ్రాన్ని రూ.18 లక్షల నగదు, 10 తులాల బంగారు ఇచ్చి దాన్ని కొనుగోలు చేశారు. బహిరంగ మార్కె్ట్ లో ఆ వజ్రం ధర రూ. 30 లక్షలు ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో మదనంతపురం పొలాల్లోకి గ్రామస్థులు పోటెత్తారు.

READ MORE: TOI-6713.01: “తనలో తాను కరుగుతున్న వింత గ్రహం”.. గురుడి ఉపగ్రహంతో పోలిక..

కాగా.. కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట మొదలవుతుంది. కానీ ఈసారి వేసవివకాలంలోనే వజ్రాల కోసం జనాలు గాలింపు మొదలుపెట్టారు. తుగ్గలి మండలంలోని తుగ్గలి, రామాపురం, చిన్నజొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, గిరిగెట్ల, మదనంతపురంలో వజ్రాల కోసం గాలిస్తారు. మద్దికెర మండలంలోని పెరవలి, మద్దికెర, బసినేపల్లి ప్రాంతాల్లో కూడా వెతుకుతారు. ఇటు అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్‌, బేతాపల్లి, ఊటకల్లు, బసినేపల్లి తదితర ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలైంది. వర్షాలు బాగా కురవగానే జనాలు పొలాలబాటపడతారు. ప్రతి ఏటా విలువైన వజ్రాలు దొరుకుతుండటంతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వెతుకుతుంటారు. పొలాల్లో దొరికిన వజ్రాలను రహస్యంగా వ్యాపారులకు అమ్మేస్తుంటారు.. వ్యాపారులు కూడా ఆ దగ్గరలోనే మకాం వేస్తారు. కొన్ని సందర్భాల్లో వేలం పాట నిర్వహించి వ్యాపారులు ఆ వజ్రాన్ని దక్కించుకుంటారు. అయితే ఇలా దొరికిన వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్క చేసి.. ఆ విలువకు తగిన విధంగా డబ్బులతో పాటుగా బంగారం ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.

Show comments