Site icon NTV Telugu

Road Accident: కారును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు సజీవదహనం

Accident

Accident

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సహరాన్‌పూర్ బైపాస్ హైవే రాంపూర్ మణిహారన్ సమీపంలోని ఛాలెంజ్ గేట్ సమీపంలోని వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాదవశాత్తు కారును ట్రక్కు ఢీకొట్టడంతో.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న నలుగురు బయటకు దిగేందుకు వీలు లేకపోవడంతో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.

Pakistan: సీమాను తిరిగి పంపకపోతే 26/11 తరహా దాడి హెచ్చరికలు.. కొందరిపై కేసు నమోదు!

ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సహరాన్‌పూర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటల్లో కాలుతున్న కారును ఆర్పే ప్రయత్నం చేశారు. మరోవైపు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సజీవ దహనం అయిన వారి మృతదేహాలను గుర్తించలేనంతగా కాలిపోయాయి. వారి స్వస్థలం, ఎవరూ అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version