Site icon NTV Telugu

Vangaveeti Mohana Ranga: వంగవీటి రంగా విగ్రహం తొలగింపు.. అంతర్వేదికరలో ఉద్రిక్తత!

Vangaveeti Mohana Ranga

Vangaveeti Mohana Ranga

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అంతర్వేదికరలో కాపు సంఘాలు వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్నికి అనుమతి లేదు అంటూ పోలీసులు తొలగించారు. పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని అంటూ కాపు సంఘాలు వాగ్వివాదానికి దిగాయి. విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి కాపు సంఘాల నేతలు ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విగ్రహాన్ని మళ్లీ ఇదే ప్లేసులో పెట్టడానికి ప్రయత్నించిన కాపు నేతలను పోలీసుల అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది.

Also Read: Chandra Sekhar Pemmasani: ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవు!

పోలీసులు నియంత్రించడానికి ప్రయత్నించినా.. ఏమీ లెక్కచేయకుండా తిరిగి కాపు సంఘాలు విగ్రహాన్ని ఇదే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమయంలో రంగా విగ్రహానికి చేయి విరిగిపోయింది. దీనితో ఎందుకు విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని పోలీసులను మహిళలు నిలదీశారు. ఈ సమయంలో పోలీసులు, కాపు సంఘాల మధ్య తోపులాట జరిగింది. అంబేద్కర్ విగ్రహం ప్రక్కన రంగా విగ్రహం పెట్టకూడదంటూ ఎస్సీ సంఘం ఆందోళన చేపట్టింది. ఘటనాస్థలికి ఇరు వర్గాలు చేరుకోవడంతో అంతర్వేదికరలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Exit mobile version