Site icon NTV Telugu

Suicide: 14వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..

Family Suicide Case

Family Suicide Case

నిండు నూరేళ్లు బతకాల్సిన బాలిక 13 ఏళ్లకే కనుమరుగైంది. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ.. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రోజున 14వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ కు పాల్పడింది. కాగా.. బాలిక 7వ తరగతి చదువుతుంది. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు అని బయటికొచ్చి.. స్కూల్ బస్సు రాకపోవడంతో మళ్లీ ఇంట్లోకి వెళ్లింది.

Read Also: Eye Sight : ఒకసారి కంటి చూపు మందగించాక రాబోయే రోజుల్లో మళ్లీ మెరుగయ్యే అవకాశం ఉంటుందా..?

అయితే బాలిక తండ్రి వేరొక చోట పని చేస్తూ ఉంటాడు. కాగా.. మొదట బాలికను స్కూల్ బస్సులో ఎక్కించేందుకు రాగా, వాహనం రాకపోవడంతో మళ్లీ తిరిగి వెళ్లిపోతాడు. కాసేపైనా తర్వాత వచ్చి చూడగా.. స్కూల్ బస్సు కోసం వేచి ఉండకుండా కనిపించడంతో ఆందోళన చెందాడు. అయితే.. ఆ తర్వాత బాలిక నివాస భవనంలోని లిఫ్ట్ ఎక్కి 14వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకి చనిపోయింది.

Read Also: Sikkim Tourists: సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యటకులు సేఫ్..

కాగా.. ఈ ఘటనపై కాంప్లెక్స్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఆత్మహత్యగా తేలిందని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి కారణం ఇంకా తెలియరాలేదు. బాలిక దుస్తులు, స్కూల్ బ్యాగ్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version