NTV Telugu Site icon

Viral Video : నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాలపై నాగు పాము..!

Viral News

Viral News

కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు జరగడం వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. కొన్ని కొన్ని అరుదైన సంఘటనకు సంబంధించిన వీడియోలు సైతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. ఉయ్యాలలో నిద్రపోతున్న ఓ చిన్నారి దగ్గరకు విష సర్పం వస్తే ఎలా ఉంటుంది.. ఓసారి ఊహించుకోండి. ఊహించుకోవడానికి భయం కల్పిస్తుంది ఆ సన్నివేశం. అయితే.. నిద్రపోతున్న ఓ చిన్నారి ఉయ్యాల మీద నాగు పాము పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఖచ్చితంగా మిమ్మల్ని ఒక్క క్షణం వణికిస్తుంది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో పొలం మధ్యలో పాము , ముంగిస మధ్య భీకర యుద్ధం కనిపిస్తుంది. తర్వాత పాము ముంగిస నుంచి తప్పించుకుని పాప నిద్రిస్తున్న ఊయలపైకి ఎక్కింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Viral News : చనిపోయాడునుకున్న వ్యక్తి చెయ్యిపట్టుకుంటే లేచాడు..

పామును తరిమికొట్టడానికి వివిధ రకాల శబ్దాలు కూడా కనిపిస్తాయి. అయితే అప్పటికే పాము చిన్నారి బట్టలపైకి ఎక్కి.. ఉయ్యాలకు ఉన్న తాడుపై పాకుతూ వెళ్లి.. బట్టలపై నుంచి పక్కనే ఉన్న ఆరిపోయిన బట్టల వరకు పాకడం వీడియోలో రికార్డైంది. అదృష్టవశాత్తూ నాగుపాము నుంచి చిన్నారికి ఎలాంటి హాని జరగకుండా తప్పించుకుంది. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో జూన్ 2న @umeshshahane72 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. షేర్ చేసిన 10 రోజుల్లోనే ఈ వీడియో 4 మిలియన్ 40 లక్షల వీక్షణలను పొందింది.

Viral : వర్షంలో ఈ ఎలుక చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

Show comments