Site icon NTV Telugu

A Ranjith Cinema : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ మూవీ..

Whatsapp Image 2023 12 29 At 1.36.16 Pm

Whatsapp Image 2023 12 29 At 1.36.16 Pm

ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కథ,స్క్రీన్ ప్లేతో అలరించే మలయాళ సినిమాలకు అలవాటు పడ్డారు. ఇటీవల మలయాళంలో విడుదల అయిన మరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎ రంజిత్ సినిమా. ఈ సినిమా డిసెంబర్ 8న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించింది.ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.శుక్రవారం (డిసెంబర్ 29) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో 18 ఏళ్ల కింద వచ్చిన ఎ ఫిల్మ్ బై అరవింద్ ను పోలి ఉండే ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఎ రంజిత్ సినిమాను నిషాంత్ సత్తు డైరెక్ట్ చేశాడు. అతనికి ఇది తొలి సినిమా కావడం విశేషం.. ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, సైజు కురుప్, అన్సన్ పాల్, నమితా ప్రమోద్, జువెల్ మేరీ మరియు హన్నా రెజి కోశి కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా లోని థ్రిల్లింగ్ మూమెంట్స్ తో పాటు ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ఈ మూవీ థియేటర్స్ లో విడుదల అయిన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.తక్కువ బడ్జెట్ తో మంచి సినిమాలు అందించడం మలయాళ ఇండస్ట్రీ ప్రత్యేకత.. ఎ రంజిత్ సినిమా కూడా అలాంటి సినిమానే అయితే ఈ మూవీ స్టోరీ తెలుగులో 2005లో వచ్చిన ఎ ఫిల్మ్ బై అరవింద్ ను పోలి ఉంటుంది.పెద్ద ఫిల్మ్ మేకర్ కావాలని కలలు కనే రంజిత్ (ఆసిఫ్ అలీ) అనే వ్యక్తి తన సినిమా కోసం రెండు స్క్రిప్ట్ లు రాసుకోవాలని అనుకుంటాడు. ఒకటేమో ఊహాజనిత స్టోరీ కాగా.. మరొకటి తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రాసుకోవాలని భావిస్తాడు. అయితే తాను రాసుకున్న ఊహాజనిత ఘటనలే తన జీవితంలో కూడా జరుగుతూ ఉండటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.చివరికి అతనిని ఓ క్రిమినల్ కేసులోనూ ఇరికిస్తుంది. మరోవైపు సన్నీ (సైజు కురుప్) అనే ఓ వ్యాపారవేత్త కూడా రంజిత్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. దీంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటాడు. ఇలా ఈ సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది.

Exit mobile version