NTV Telugu Site icon

Viral Video: రైలులో మహిళ పర్సు కొట్టేసిన దొంగ.. చుక్కలు చూపించిన ప్రయాణికులు

Thief

Thief

A Thief Hanging out side the Window Of Moving Train: ట్రైన్స్ లో తరచూ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఫోన్లు, పర్సులు కొట్టేస్తూ ఉంటారు. అయితే ఆ కొట్టేసిన దొంగలు దొరకడం కష్టమే. ఎందుకంటే వారు చటుక్కున కొట్టేసి లటుక్కున పారిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ దొంగ అలాగే ట్రై లో పర్స్ కొట్టేయబోయి ప్యాసింజర్లకు దొరికిపోయాడు. దీంతో వారు అతనికి చుక్కలు చూపించారు. కదులుతున్న రైలులోనే అతని చేతిని పట్టుకొని కిటికీకి వేలాడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Viral Video: అతి తెలివి చూపిన ఆటో డ్రైవర్.. తిక్క కుదిర్చిన పోలీసులు

బీహార్‌లోని బెగూసరాయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కటిహార్ నుంచి సమస్తిపూర్ వెళ్తున్న రైలులో  ఓ దొంగ మహిళ పర్స్ కిటికీలో నుంచి కొట్టేశాడు. అయితే ఇంతలో ట్రైన్ కదలడంతో అతడు కిటికీ చువ్వులు పట్టుకొని ఉండిపోయాడు. దీంతో అతడిని పట్టుకున్న ప్రయాణికులు ఎక్కడికి పారిపోకుండా అతని చేతిని గట్టిగా పట్టుకున్నారు. అయితే ఆ దొంగ మాత్రం తనని కాపాడాలని, వదిలి పెట్టాలని వేడుకున్నారు. అయిన కానీ ప్రయాణికులు అతడిని వదలకుండా గట్టిగా అలానే పట్టుకున్నారు. అలా కొన్ని కిలో మీటర్ల పాటు అలాగే దొంగను కిటికీ నుంచి గాల్లో వేలాడదీసి పట్టుకున్నారు. దీంతో ఆ దొంగకు పట్టపగలే చుక్కలు కనిపించాయి.తరువాత కొద్దిసేపటికి రైలు బచ్వారా జంక్షన్‌లో ఆగింది. అక్కడ  ఆర్పీఎఫ్ పోలీసులకు దొంగను అప్పగించారు ప్రయాణికులు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని చూసిన చాలా మంది ఆ దొంగపై జాలి చూపిస్తున్నారు. అలా చేస్తే అతడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళ వ్యక్తం చేశారు. మరి కొంతమంది దొంగతనానికి కొత్తేమో అందుకే దొరికిపోయాడు పాపం  అంటూ కామెంట్ల చేస్తున్నారు.

 

 

 

 

.

 

Show comments