NTV Telugu Site icon

School Bus: నేలకొండపల్లిలో స్కూల్ బస్సు దగ్ధం

Bus

Bus

School Bus: ఖమ్మం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. నడిరోడ్డుపై స్కూల్ బస్సు పూర్తిగా కాలిపోయింది. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఖమ్మం నుండి కోదాడ వెళ్తున్న కోదాడ కు చెందిన తేజ టాలెంట్ స్కూల్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం అయింది. ఖమ్మం లోని ముస్తఫానగర్ లో ఓ పెళ్లి రిషెప్షన్ కార్యక్రమంకు హాజరై కోదాడ కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో ముప్పై మంది పెళ్లి బృందం సభ్యులు ఉన్నారు.

Read Also:Ship Type Home: భార్య కోరిందని అచ్చం షిప్ టైపు ఇల్లు కట్టిన భర్త

బస్సు లో మంటలు రావడాన్ని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సు ను పక్కకి ఆపి వెంటనే పెళ్లి బృందం సభ్యులను అలర్ట్ చేశారు. అనంతరం వారంతా వేరే బస్సులో వెళ్లిపోయారు. డ్రైవర్ ఆ సమయంలో అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామ శివారులో ఈ ప్రమాదం జరగటంతో చుట్టు పక్కల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ లతో మంటలను ఆర్పి వేశారు. సమయానికి స్థానికంగా పైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడం బస్సు పూర్తిగా కాలిపోయింది.

Read Also:Indian Sailors: 9 నెలల తర్వాత నైజీరియా నుంచి స్వదేశానికి వచ్చిన 16 మంది భారతీయులు

దేశంలో ఎండలు భగభగా మండిపోతున్నాయి. ఈ సమయంలో ప్రయాణించే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన సమయంలో వాహనాన్ని కాసేపు ఆపి మరలా ప్రయాణించండి. అలాగే ఎక్కువ సేపు ఎండలో పార్క్ చేసి ఉంచకండి. వీలైనంత వరకూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

Show comments