NTV Telugu Site icon

America: యూఎస్ లో సత్యనారాయణస్వామి వ్రతం..ఇంగ్లీష్ లో కథ చెప్పిన పూజారి..వీడియో వైరల్

Us

Us

భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతనమైనది. హిందు ధర్మంలో ప్రతి కులానికి ఓ ఆచారం ఉంది. మన ఆచారాలు, కులదేవుళ్లు, పూజా విధానం రాను రాను మారుతూ వస్తోంది. బతుకుదెరువు కోసం జనాలు పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారు. వలస వచ్చిన నగర వాసులకు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ధర్మాన్ని మరుస్తున్నారు. విదేశీయులు మాత్రం మన ధర్మానికి ఫిదా అవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. అందేంటో ఇప్పుడు చూద్దాం..

READ MORE: MEDCY IVF CENTER : పురుష వంధ్యత్వం, ఐవీఎఫ్.. సవాళ్లు, పరిష్కారాలను అర్థం చేసుకోవడం ఎలా..?

భారతీయ ఆచారాలు, సంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడినా చాలా మంది భారతీయులు ఇక్కడి పూజా విధానాలను సంప్రదాయబద్ధంగా ఆచరిస్తుంటారు. దీంతో చుట్టు పక్కలున్న విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయతకు ఆకర్శితులవుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా శ్రీ సత్యనారాయణ స్వామిని భక్తులు కొలుస్తుంటారు. సత్యదేవుని వ్రతానిది ఓ ప్రత్యేక స్థానం.

READ MORE:NaveenPolishetty: సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న నవీన్‌ పొలిశెట్టి వీడియో.. వీడియోలో ఏముందంటే..

నూతన గృహ ప్రవేశ సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్త ఇంట్లో ఆచరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాంటి సత్యదేవుని వ్రతాన్ని అమెరికాలోని ఓ నూతన ఇంట్లో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దీంట్లో విశేషం ఏముందని అనుకోవచ్చు. దీనికి సంబంధించిన కథను పురోహితుడు ఆంగ్లంలో అద్భుతంగా వివరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. అర్చకులు వేద మంత్రాలు చదువుతుండగా అక్కడి వారు భక్తి శ్రద్ధలతో విన్నారు. ఇంగ్లీష్ సత్యదేవుని వ్రత కథను అర్థమయ్యేలా పురోహితుడు వివరించడంతో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Show comments