NTV Telugu Site icon

Murder: అప్పు ఇచ్చిన పాపానికి దారుణంగా హత్యకి గురైన వృద్దురాలు..!

7

7

మనం ఎవరికైనా మంచిని ఆశిస్తే సహాయం చేస్తే.. వారు తిరిగి ఆ మంచి సహాయాన్నిచేయకపోగా కీడును చేసే రోజులివి. ఓ మహిళ వృద్ధురాలు దగ్గర తీసుకున్న బాకిని తీర్చకపోగా ఆవిడను హత్య చేశారు కిరాతకులు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఓబులమ్మను అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఆయన కుటుంబ సభ్యులు దారుణంగా హత మార్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే..

Also Read: Pragya Jaiswal : అదిరిపోయే లుక్ లో అఖండ బ్యూటీ స్టిల్స్..

ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థులని ఓ మేరెవరకే వెంబడించి దారుణంగా హత్య చేస్తారు. కానీ ఈ వృద్ధురాలని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు కొందరు. తీసుకున్న అప్పును కట్టమన్నందుకు ఆమెను కిరాతకంగా నరికి చంపారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. 85 ఏళ్ల వృత్తురాలు ఓబులమ్మ దగ్గర అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి డబ్బులు అడిగాడు. ఆ సమయంలో తన దగ్గర డబ్బులు లేవని ఓబులమ్మ చెప్పడంతో కృష్ణమూర్తి.. నీ వద్ద ఉన్న బంగారం ఇస్తే అది తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకుంటానని.. ఆ తర్వాత తానే బంగారం తాకట్టు నుంచి విడిపించి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ వృద్ధురాలు బంగారు తాకట్టు పెట్టి డబ్బులు కృష్ణమూర్తికి ఇచ్చింది. అయితే బంగారం విడిపించమని ఓబులమ్మ అనేకసార్లు అడిగినా కృష్ణమూర్తి ఆమెను వినిపించకుండా తిరిగేవాడు. ఇలా ప్రతిరోజు ఓబులమ్మ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులతో సహా మృతురాలు ఓబులమ్మను అతి కిరాతకంగా ప్లాన్ చేసి చంపారు.

Also Read: Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించాడు..

ఇందులో భాగంగా ఓబులమ్మకు డబ్బులు ఇస్తామని చెప్పి బైక్ మీద ఎక్కించుకొని ఊరి బయట ఉన్న పొలం దగ్గరికి తీసుకువెళ్లారు కృష్ణమూర్తి. అయితే అక్కడే కృష్ణమూర్తి వారి కుటుంబ సభ్యులు కలిసి ఓబులమ్మను హత్య చేశారు. ఆ తర్వాత మృహదేహాన్ని పలు ముక్కలుగా చేసి ఓ గోన సంచిలో వేసి పెన్నా నదిలో పడేశారు. ఆ తర్వాత కృష్ణమూర్తి ఏమీ తెలియనట్లు వృద్ధురాలు ఓబులమ్మ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందజేశాడు. అయితే పోలీసులు వారి స్టైల్ లో విచారణ చేపట్టిన తర్వాత కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులు వృద్ధురాలని హత్య చేసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు పూర్తి విచారణ చేయగా.. ఓబులమ్మ అడ్డు తొలగించుకుంటే అప్పు తీరిపోవడమే కాకుండా.. ఆమె వద్ద ఉన్న భూమిని కూడా సొంతం చేసుకోవాలన్న దురాశతోనే కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఈ గాతగానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు.

Show comments