NTV Telugu Site icon

Muchumarri Girl Incident: ముచ్చుమర్రి బాలిక కేసులో ట్విస్ట్..! ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి..

Muchumarri

Muchumarri

Muchumarri Girl Incident: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య తర్వాత మృతదేహాన్ని మాయం చేసిన కేసులో పోలీసుల విచారణ కొనసాగుతూనే ఉంది.. అయితే, ఈ కేసులో రోజుకో.. పూటకో ట్విస్ట్‌ అనే మాదిరిగా కొనసాగుతూనే ఉంది.. బాలిక మిస్సింగ్‌ కేసులో నిర్లక్ష్యం వహించారంటూ.. నందికొట్కూరు రూరల్‌ సీఐ, ముచ్చుమర్రి ఎస్సై ని సస్పెండ్‌ చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. సొంతింటి నిర్మాణం, పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.. ఇంకో వైపు.. బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగానే.. ఈ కేసు కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది..

Read Also: Gopanpally Flyover: నేడు గోపల్‌పల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం.. తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు..

ఈనెల 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది.. ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్యచేసినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు.. బాలిక మృతదేహాన్ని కేసీ కెనాల్ గట్టుపై పడేసినట్టు చెప్పారు.. ఆ తర్వాత కొంత దూరంలోని పొదల్లో పడవేశారని.. లేదు మరో చోట పాతిపెట్టారని.. ఇంకా.. మృతదేహం బయటకు తేలకుండా రాళ్లు కట్టి వేశారని.. ఇలా అనేక రకాలుగా ప్రచారం సాగుతూ రోజుకో ట్విస్ట్‌ ఇస్తూ వచ్చింది.. ఇక, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు, ప్రజా సంఘాలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే, నంద్యాలలో యోహాను(35) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. మృతుడు ముచ్చుమర్రి వాసిగా గుర్తించారు.. ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం, హత్య కేసులో యోహానును పోలీసులు విచారించినట్టు సమాచారం.. యోహాను ఆత్యహత్య చేసుకున్నారా..? ఇంకా ఏమైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని కృష్ణ నదిలో పడేసిన నిందితుల్లో యోహాను ఒకరి తండ్రి, మరొకరి పెదనాన్న అవుతారు.. నిందితులు ఐదుగురిని ఈ నెల 16న అరెస్ట్ చేశారు పోలీసులు.. మృతదేహం ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.. ఇంకోవైపు.. మృతదేహం కోసం 9వ తేదీ నుంచి గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉండగా.. మోహాను మృతి ఈ కేసులో ట్విస్ట్‌ ఇచ్చినట్టు అయ్యింది.