Site icon NTV Telugu

Mother Kills Her Son: కొడుకును చంపిన తల్లి.. చిన్నారి శవాన్ని ఏం చేసిందో తెలుసా

Mother Kills Her Son

Mother Kills Her Son

Mother Kills Her Son: తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని మోసి కన్న కొడుకుని తన చేతులతోనే గొంతుపిసికి చంపి బావిలో పడేసిందో కసాయి తల్లి. ఐదు నెలల పసికందును తల్లి కడతేర్చిన అమానవీయ ఘటన నారాయణ పేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కోస్గి పట్టణ కేంద్రంలోని హరిజనవాడలో గోవిందు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. అందులో మొదటి భార్యకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. పుట్టుకతోనే మూగ అయిన రెండో భార్య కాశమ్మ గత ఐదు నెలల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Read Also: A Man Sudden death In Marriage : పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ వధువు మేనమామ మృతి.. షాక్‎లో కుటుంబం

కాగా నిన్న రాత్రి మూడు గంటల సమయంలో కాశమ్మ పసిబిడ్డను గొంతు నులిపి చంపింది. అనంతరం బావిలో పడేసి చంపేసింది. ఉదయం కుటుంబ సభ్యులు పసిబిడ్డ కోసం వెతకారు. ఆచూకీ లభించక పోవడంతో కాశమ్మను నిలదీయగా ఎవరో ఎత్తుకెళ్లారని చెప్పింది. పోలీసులను కుటుంబ సభ్యులు ఆశ్రయించడంతో వారు వచ్చి కాశమ్మను విచారించారు. కాశమ్మను గట్టిగా నిలదీయడంతో బావిలో పడేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులు కాశమ్మతో సహ బావి వద్దకు చేరుకున్నారు. మూగ సైగలతో పోలీసులకు బావిలో పసిబిడ్డను పడేసినట్లు చూపించింది. వారు వెళ్లి చూడగా పసికందు మృతదేహం నీటి పైన తేలడంతో స్థానికుల సహాయంతో పోలీసులు బావిలో నుండి వెలికితీసి, కాశమ్మ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు పోలీసులు.

Exit mobile version