Site icon NTV Telugu

A Master Piece: మాస్టర్ పీస్ రెడీ అవుతోంది.. ఉగాది పోస్టర్ అదిరింది..

Master

Master

ప్రతి పండుగకు సినిమాల సందడి మాములుగా ఉండదు.. కొత్త సినిమాల నుంచి పోస్టర్స్, లేదా సినిమా అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి.. ఈ ఉగాది పండుగ సందర్బంగా చాలా సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి.. తాజాగా మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి ప్రధాన పాత్రలో లో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు..

ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ భాగస్వామి అయ్యింది. ఈ సంస్థతో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు..మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది.. ఈ సినిమా భారీ క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో స్నేహ గుప్త, అర్చనా అనంత్, జయప్రకాశ్, చందు, మనీష్ గిలాడ తదితరులు నటిస్తున్నారు…

Exit mobile version