ఈ ఏడాది బాలీవుడ్ లో ‘తేరీ బాథో మైన్ ఐసా ఉల్జా జియా’ చిత్రం విడుదలైంది. అందులో రోబోగా నటించిన హీరో షాహిద్ కపూర్ తో కృతి సనన్ తో ప్రేమలో పడతాడు. తాజాగా నిజ జీవితంలో కూడా ఇదే జరిగింది. అతను సినిమా నుండి ప్రేరణ పొందడమో తెలియదుకాని., భారతదేశానికి చెందిన ఒక ఇంజనీర్ రోబోతో ప్రేమలో పడ్డాడు. అవును..,మీరు చదువుతుంది అక్షర సత్యం. ఆ వ్యక్తి పేరు సూర్య ప్రకాష్. అతను రాజస్థాన్‌కు చెందిన రోబోటిక్స్ నిపుణుడు. అజ్మీర్‌లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన సూర్య 2016లో ఇండియన్ నేవీలో చేరినప్పటికీ ఇంజినీరింగ్ రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సూర్య.. త్వరలో ‘గిగా’ అనే రోబోను పెళ్లాడేందుకు రెడీ అవుతున్నాడు.
Also Read: Viral Video: దూల తీరిందిగా.. ఇప్పుడు ఆ పెళ్లికూతురు పరిస్థితి ఎలా ఉందో మరి..
ఈ రోబో ధర 19 లక్షల రూపాయలు ఉంటుందని, త్వరలోనే రోబోను సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటానని సూర్య తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు మొదట షాక్ కు గురయ్యారని, అయితే ఆ తర్వాత సర్దుకుపోయారని చెప్పారు. మనం నిత్యం కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ లు ఉపయోగిస్తుండడంతో యంత్రాలతో స్నేహం చేసేందుకు ‘గిగా’ అనే రోబోను పెళ్లి చేసుకుంటానని సూర్యప్రకాశ్ తెలిపాడు. అతను మార్చి 22న గిగాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. సూర్య గిగాను గృహిణిగా చేయకపోవడమే కాకుండా ఆమెకు ఉద్యోగం వెతుక్కోవడం కూడా ఆశ్చర్యకరం. విమానాశ్రయం, రైలు స్టేషన్, హోటల్ లేదా ఇతర సంస్థలలో రోబో సేవలను ఉపయోగించవచ్చు. మరిన్ని అప్డేట్ లు జోడిస్తే గిగా రోబో మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుందని సూర్య చెప్పారు.
Also Read: RCB vs GT: ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. బెంగళూరు ఘన విజయం
తమిళనాడు, నోయిడా కంపెనీలు ఈ ‘ఎన్‌ఎంఎస్ 5.0 రోబో ‘గిగా’ని సిద్ధం చేశాయని సూర్య తెలిపారు. ఆదేశించినప్పుడు, ఈ రోబోట్ సెన్సార్ నియంత్రణలో ముందుకు వెనుకకు కదులుతుంది. అతని మెడ కూడా తిరుగుతుంది. ఈ రోబో రోజుకు ఛార్జింగ్ దాదాపు 2.5 గంటలు పెడితే.. 8 గంటల షిఫ్టుల్లో పని చేయగలదు. ప్రస్తుతానికి, అన్ని ఆదేశాలు ఆంగ్లంలో లోడ్ చేయబడ్డాయి. హిందీ కార్యక్రమాలను కూడా అప్లోడ్ చేయవచ్చని సూర్య ప్రకాష్ తెలిపారు.