NTV Telugu Site icon

Marriage Cheater: పోలీసును అంటూ.. 5 మందితో వివాహం.. మరో 50 మందితో..

Marriage

Marriage

Marriage Cheater: మ్యాట్రిమోనియల్ సైట్‌లలో మోసానికి సంబంధించిన అనేక కథనాలను ఈమధ్య కాలంలో తరుచుగా చూస్తున్నాము. ఇకపోతే తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పెళ్లి మోసానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఓ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఐదుగురు మహిళలను తన మాటలతో మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు పెళ్లి కోసం దాదాపు 50 మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు మహిళల ఫిర్యాదుతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడిని 34 ఏళ్ల సత్యజిత్ సమాల్‌గా గుర్తించారు. పోలీస్ ఆఫీసర్ గా నటిస్తూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. అతని వద్ద నుంచి కారు, బైక్, రూ. 2.10 లక్షలు, పిస్టల్, పెళ్లి ఒప్పందాలు స్వాధీనం చేసుకున్నారు.

Film Fare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌లో ‘చిన్నా’ హవా.. ఏకంగా 7 అవార్డులు!

భువనేశ్వర్ – కటక్ పోలీస్ కమిషనర్ సంజీవ్ పాండా మాట్లాడుతూ.. ఇద్దరు మహిళల నుండి వేర్వేరు ఫిర్యాదులు అందడంతో ఒక మహిళా అధికారి నేతృత్వంలో పోలీసులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం విచారణ కారణంగా నిందితుడిని అరెస్టు చేయగలిగారు. విచారణలో ఆ ఇద్దరు మహిళలను తాను పెళ్లి చేసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అతని 5 మంది భార్యలు ఉన్నారని పోలీసులు కనుగొన్నారు. 5 మందిలో అతని నలుగురు భార్యల గురించి పోలీసులు తెలుసుకున్నారు. అయితే, ఐదవ భార్య గురించి ఇంకా సమాచారం అందుబాటులో లేదు. నిందితుడి మూడు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అతను ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందినవాడు. కానీ., ప్రస్తుతం భువనేశ్వర్‌లో నివసిస్తున్నాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేసేవాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నగదు, బైక్, కారు డిమాండ్ చేసేవాడు.

Sunday Stotram: ఈ అభిషేకం తప్పక వీక్షిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి..

మహిళలు డబ్బులు తిరిగి అడిగితే పిస్టల్‌తో బెదిరించేవాడు. అతడి మొబైల్‌ను పరిశీలించిన పోలీసులు మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో 50 మంది మహిళలతో చాటింగ్‌ చేస్తున్నట్టు గుర్తించారు. ఫిబ్రవరిలో రాజధాని పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు ఫిర్యాదుదారులలో ఒకరి ప్రకారం, ఆమెకు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా సత్యజిత్ సమాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రెగ్యులర్ గా చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. కొద్దిరోజులు మాట్లాడుకున్న తర్వాత కలవడం మొదలుపెట్టారు. పెళ్లి సాకుతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, కారు కొనేందుకు డబ్బులు అడిగాడు. బాధితుడు బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకుని రూ. 8.15 లక్షల విలువైన కారును కొనుగోలు చేశాడు. దీని తర్వాత వ్యాపారం చేసేందుకు రూ.36 లక్షలు కూడా ఇచ్చారు. రెండో ఫిర్యాదుదారుడి నుంచి నిందితులు రూ.8.60 లక్షలు, బైక్‌ తీసుకున్నారు.