Site icon NTV Telugu

Sri satya sai: టోల్ ఫీ తప్పించుకో బోయి తగలబడ్డ లారీ

Lorryy

Lorryy

Sri satya sai: పేలే స్వభావం ఉన్న  బ్యాటరీలు, టపాసులు, కొన్ని రకాల కెమికల్స్ లాంటి వస్తువులను తరలిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనంలో ఉన్న వస్తువులు పేలి మంటలు చెలరేగే అవకాశం ఉంది. తాజాగా అలాంటి ఓ ఘటనే హిందూపురంలో జరిగింది. బ్యాటరీలను తీసుకువెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా  దగ్దమైపోయింది.

Also Read: Australia Squad: ప్రపంచకప్‌ 2023కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు ప్లేయర్స్ ఔట్!

ఓ లారీ హైదరాబాద్ నుంచి బ్యాటరీలను తీసుకొని బెంగుళూరు వెళ్తుంది. టోల్ గేట్ కట్టకుండా తప్పించుకునేందుకు లారీని హిందుపురం కొల్లకుంట మీదుగా డ్రైవర్ తీసుకువెళ్లాడు.  అయితే కొల్లకుంట ఫ్లై ఓవర్ మీదకు చేరుకోగానే ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ లారీ నుంచి కిందకి దిగేశాడు. ఈ ఘటనలో లారీ మొత్తం కాలిపోయింది. అంతేకాకుండా దానిలో రూ.60 లక్షలు విలువచేసే మొబైల్ బ్యాటరీలు కూడా ఉన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదంలో అవి కూడా పూర్తిగా తగలబడిపోయాయి. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నుంచి పూర్తి సమాచారాన్ని రాబడుతున్నాయి. అసలు బ్యాటరీలు అంటుకోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. నిబంధనల ప్రకారమే సరుకును తరలిస్తున్నారా లేదా అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

Exit mobile version