NTV Telugu Site icon

Lightning In Football Match: లైవ్ మ్యాచ్‌లో పిడుగుపాటు.. ఆటగాడు మృతి (వీడియో)

Lightning In Football Match

Lightning In Football Match

Lightning In Football Match: ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఓ ఆటగాడు చనిపోయాడు. అలాగే రిఫరీ సహా పలువురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లను, రిఫరీని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం నాడు జరిగిన ఈ ఘటనతో క్రీడా ప్రపంచంలో విషాద ఘటనగా పేర్కోవచ్చు. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలో ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పాటు కారణంగా ఒక ఆటగాడు మరణించాడు. అంతేకాకుండా, రిఫరీ సహా పలువురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: Virat Kohli Birthday: విరాట్ కోహ్లీపై అభిమానం.. సాగర తీరంలో సైకత శిల్పం!

తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లను, రిఫరీని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటన పెరూలో జరిగింది. నవంబర్ 3న, పెరూలోని చిల్కాలో రెండు దేశీయ క్లబ్‌లు జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొక్కా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మ్యాచ్ ప్రథమార్థం జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో జువెంటుడ్ బెల్లావిస్టా మ్యాచ్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సమయంలో వాతావరణం మరింత దిగజారడంతో.. రెఫరీ విజిల్‌ వేసి గేమ్‌ను నిలిపివేశాడు. అలాగే ఆటగాళ్లను మైదానం వీడాల్సిందిగా కోరారు. ఈ సమయంలో ఆటగాళ్లు వెళ్లిపోతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ మెరుపు 39 ఏళ్ల ఆటగాడు జోస్ హ్యూగో డి లా క్రూజ్ మెసాపై పడింది. దాంతో అతడు చనిపోయాడు. మెరుపు కారణంగా, రిఫరీతో సహా 5 మంది ఆటగాళ్లు కలిసి మైదానంలో పడిపోయారు.

ఈ ప్రమాదంలో 40 ఏళ్ల గోల్ కీపర్ జువాన్ చోకా తీవ్రంగా కాలిపోయాడు. అతని శరీరంపై కాలిన గాయాలున్నాయి. మెరుపు దాడి తర్వాత, మైదానంలో పడిపోయిన ఆటగాళ్లలో ఒకరిద్దరు లేచేందుకు ప్రయత్నించారు. గాయపడిన ఆటగాళ్లంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిడుగుపాటుకు ఫుట్‌బాల్ క్రీడాకారుడు మృతి చెందడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేషియాలోని పశ్చిమ జావాలోని సిలివాంగి స్టేడియంలో స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. అప్పుడు 35 ఏళ్ల సెప్టెన్ రహరాజా అకస్మాత్తుగా పిడుగుపాటు కారణంగా మరణించాడు. దీంతో రహరాజుకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Show comments