Site icon NTV Telugu

Huge Fire : మధ్య ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్ల ఆస్తి నష్టం

Fire

Fire

Huge Fire : మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్యాపార మేళాలో వరుసగా ఉన్న పదుల సంఖ్యలోని దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్, వస్త్ర దుకాణాలన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో సుమారు కోటి యాభై లక్షల రూపాయలు విలువైన వస్త్రాలు మంటల్లో కాలిపోయాయి.

Read Also: Gangula Kamalakar : ప్రజలను ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉంది

దీంతో వాటి యజమానులు లబోదిబోమంటున్నారు. మొదట ఐదు, ఆరు నెంబర్ల దుకాణాల్లో మొదలైన మంటలు ఆ తర్వాత ఫెయిర్ మొత్తానికే అంటుకున్నాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో సహయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also:Nabha Natesh: ఏం మధువు దాగుందో ఈ మగువలో చూస్తేనే కిక్కేకేలా..

Exit mobile version