a funny video viral on social media over Turkish ice-cream
రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. దీంతో.. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ ఏం జరిగినా ఆ వార్త క్షణాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఇప్పుడు మానవుడి జీవితంలో నిత్య కృత్యంగా మారింది. అయితే.. అందుకు కారణమూ లేకపోలేదు. సోషల్ మీడియాలో వచ్చే వింతలు, విశేషాలు, ఫన్నీ ఫన్నీ వీడియోలు. రోజూ ఎన్నో ఫన్నీ వీడియోలను చూస్తూనే ఉంటాం.. అయితే ఇప్పుడు మరో ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం ఏంటంటే.. టర్కిష్ ఐస్‌క్రీం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. టర్కిష్ ఐస్‌క్రీం సబంధించిన వీడియో సోషల్ మీడియాలో కొకొల్లలుగా ఉన్నాయి. అయితే తాజాగా మరో టర్కిష్ ఐస్‌క్రీంకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మామూలుగా టర్కిష్ ఐస్‌క్రీంను తీసుకోవాలని కొంచెం మీ సహనానికి పరీక్ష పెడుతూ.. ఐస్‌క్రీం ఇచ్చే వ్యక్తి ఐస్‌క్రీం ఇవ్వకుండా ఆటపట్టించే చేష్టలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఓ బుడ్డోడికి కూడా.. అదే పరిస్థితి ఎదురైతే.. ఏకంగా.. ఐస్‌క్రీం ఇచ్చే వ్యక్తికే షాక్ ఇచ్చే విధంగా.. ఐస్ క్రీం తీసుకున్నాడు. దీన్ని చూసిన అక్కడి వారంతా.. నవ్వాపుకోలేకపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అట్లుందటి మనతోని ముచ్చట అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మీరు చూసేయండి..!
అట్లుంటది మనతోని ముచ్చట..😎 https://t.co/R6zvDgpEhf
— Krishna Gogikar (Journalist) (@Krishna614) August 30, 2022
