Site icon NTV Telugu

Robbery Video: దేవుడా.. మూర మల్లెపూల కోసం మరి ఇంతలా దిగజారాలా..?

15

15

ఎక్కడైనా చోరీ జరిగిందంటే.. కాస్త డబ్బు, నగలు, విలువైన వస్తువులు ఇంకా అనుకుంటే ఏదైనా ఖరీదైన పరికరాలు కనపడకుండా పోతాయి. కాకపోతే వైరల్ గా మారిన ఓ వీడియోలో ఉన్న చోరీ చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. చోరీ జరిగిన సమయంలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే నవ్వు ఆపుకోలేరు. అసలు అక్కడ ఇంతకీ ఏం దొంగతనం జరిగిందో తెలుసా.? వినియాడానికే విడ్డురంగా ఉన్న పూల దొంగతనం జరిగింది. అది కూడా ఎలా జరిగిందో మీరే ఓ లుక్ వేయండి.

Viral Video: Sukesh Chandrashekhar: ‘తీహార్‌ జైలుకు స్వాగతం’ అంటూ కేజ్రీవాల్‌కు సుకేష్ సందేశం

ఈ వెరైటీ చోరీ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యాపారి తన షాప్‌ లో పూజ కోసం పూల వ్యాపారులు ప్రతిరోజూ పూల దండలతో పాటు, కొన్ని విడిపూలను షాప్ ముందు షటర్‌ కు తగిలించి వెళ్తారు. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే.. ప్రతీ రోజూ పూల వ్యాపారులు తగిలించిన కవర్ ఉంటుంది కానీ.. అందులోని పూలు మాత్రం మాయమవుతున్నాయి. దాంతో అనుమానం వచ్చి సీసీటీవీ ఫ్యూటేజ్ ను పరిశీలిస్తే అసలు కథ మొత్తం బయటపడింది.

Viral Video: K.Kavitha: కవితకు షాక్.. మరో మూడురోజుల కస్టడీ పొడిగింపు..!

పూల వ్యాపారులు తగిలించిన కవర్ కోసం ఓ గుర్తు తెలియని మహిళ అక్కడ రెక్కీ నిర్వహించి.. ఆపై ఆ పూలను మాయం చేస్తోంది. అలా తీసుకున్న పూలని తన మెడలో ధరించి మురిసిపోతోంది. ఈ ఘటనపై సంబంధించిన సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయిన చోరీ చూసిన ప్రతీ ఒక్కరూ నవ్వుకున్నారు. ఈ విచిత్ర చోరీ సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని గ్రంథాలయం సమీపంలో చోటు చేసుకుంది. ఈ పూల చోరీ గ్రంధాలయం ఎదురుగా ఉన్న ప్రకాష్ ఎలక్ట్రికల్స్ షాప్ షట్టర్ వద్ద జరిగింది. పూలదండ కోసం ఇలా చోరికి పాల్పడుతున్న ఈ చిత్రమైన మహిళ ఎవరో అని ఆరా తీస్తున్నారు షాప్ యజమానులు.

Exit mobile version