Site icon NTV Telugu

The Indrani Mukerjea Story: Buried Truth : ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్..

Whatsapp Image 2024 03 09 At 3.24.14 Pm

Whatsapp Image 2024 03 09 At 3.24.14 Pm

ఓటీటీ ప్రేక్షకులు డాక్యుమెంటరీ సిరీస్‍లపై ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా సంచలన కేసుల ఆధారంగా రూపొందిన క్రైమ్ సిరీస్‍లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్‍కు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా ఉండడంతో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది.ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్ సిరీస్‍పై మొదటి నుంచే చాలా మందికి ఆసక్తి నెలకొంది. కోర్టులో కేసుల వల్ల ఆలస్యమైనా ఎట్టకేలకు ఈ సిరీస్ ఫిబ్రవరి 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ప్రారంభం నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోంది.. భారత్‍తో పాటు కెనడా, ఆస్ట్రేలియా సహా సుమారు 18 దేశాల్లో ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‍లో టాప్-7లో ఈ సిరీస్ నిలిచింది. వారంలోనే ఈ డాక్యు సిరీస్‍కు 2.2 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. 6.9 మిలియన్ వాచ్ హవర్స్ ను దక్కించుకుంది. మొత్తంగా అంచనాలకు మించి ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ దుమ్మురేపుతోంది. షీనా బోరా హత్య కేసులో చాలా ట్విస్టులు ఉండడం, దాన్ని ఈ సిరీస్‍లో ఎఫెక్టివ్‍గా చూపించడంతో భారీ ఆదరణ దక్కించుకుంటోంది..

షీనా బోరా కేసు విచారణ దశలో ఉండటంతో ఈ సిరీస్‍ను ఆపాలని కోర్టుకు వెళ్లింది సీబీఐ. కింది కోర్టు నిరాకరించడంతో సీబీఐ బాంబే హైకోర్టుకు కూడా వెళ్లింది. ముందుగా సీబీఐ అధికారులకు స్క్రీనింగ్ తర్వాత.. ఈ సిరీస్ ఎట్టకేలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. వారం ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.షీనా బోరా మర్డర్ కేసు దేశాన్ని కుదిపేసింది. 2012 ఏప్రిల్‍లో షీనా హత్యకు గురయ్యారు. అయితే, మూడేళ్ల తర్వాత 2015లో ఈ హత్య ఉదంతం బయటికి వచ్చింది. వేరే కేసులో పట్టుడిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ ఈ హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో షీనా హత్య వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను 2015లో అరెస్టు చేయడం సంచలనంగా మారింది.షీనా బోరా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది.

Exit mobile version