NTV Telugu Site icon

IndiGo flight: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపులు..

Indigo Flight

Indigo Flight

Bomb Threat: ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఖాళీ చేయించిన సిబ్బంది.. దర్యాప్తు కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు నిర్వీర్య బృందంతో పాటు క్విక్ రియాక్షన్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Read Also: Tuesday Stotram: మంగళవారం ఈ స్తోత్రాలు వింటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి

కాగా, ప్రయాణీకులందరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది. విమానాన్ని తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఈరోజు ఉదయం 5:35 గంటలకు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న విమానంలో బాంబు ఉందన్న సమాచారం వచ్చింది.. QRT సంఘటనా స్థలానికి చేరుకుంది.. ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులందరినీ బయటకు తరలించి.. విమానాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది.ఇక, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show comments