Site icon NTV Telugu

Beautician : వ్యాపారంలో లాభాలు తెప్పిస్తానని లైంగికదాడి చేశాడు

Beautician

Beautician

Beautician : ఆమె బ్యూటీషియన్ ఈ మధ్యే సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టింది. ఎంత చూసినా వ్యాపారంలో లాభాలు రావడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. సమస్యలు తీవ్రం అవుతున్నాయి. దీన్ని ఎలాగోలా అధిగమించుకోవాలనుకుంది. దీన్ని నివారించేందుకు ఆమె ఓ వ్యక్తిని ఆశ్రయించింది. అతడు ఆమె పరిస్థితి అంతా విన్నాడు. వ్యాపారం లాభసాటిగా ఉండేందుకు పూజలు చేస్తానని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె అతడిని గుడ్డిగా నమ్మింది. పూజలో భాగంగా మహిళ కుటుంబ సభ్యులందరినీ ఇంటి నుంచి బయటకు పంపించాడు. అనంతరం బ్యూటీషియన్‌పై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో వెలుగు చూసింది.

Read Also:Hyderabad: రాజధానిలో రెచ్చిపోయిన దొంగలు.. చోరి చేసి.. మహిళను చంపారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజ్నోర్‌లో 32 ఏళ్ల మహిళ బ్యూటీ పార్లర్ నడుపుతోంది. కొంతకాలంగా ఆమె వ్యాపారంలో తీవ్రంగా నష్టాలు రావడంతో ఆవేదన చెందింది. సమస్యలనుంచి బయటపడి వ్యాపారాన్ని లాభసాటిగా చూడాలనుకుంది. ఆ క్రమంలోనే ఆ మహిళ ఓ పూజారిని ఆశ్రయించింది. ఆమె ఆవేదనను పూజారి తన అవకాశంగా మార్చుకోవాలనుకున్నాడు. పూజ చేసి పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చాడు. దీంతో పూజ చేస్తే వ్యాపారంలో తప్పకుండా లాభాలు వస్తాయని నమ్మింది.

నిందితుడు పూజ చేసేందుకు మహిళ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో పూజలు చేస్తానని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండకూడదన్నారు. కుటుంబ సభ్యులందరినీ ఇంటి నుంచి బయటకు పంపించాడు. బాధిత మహిళను మాత్రమే ఇంట్లో ఉండాలని సూచించాడు. అతని మాటలు విని కుటుంబ సభ్యులంతా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే మంచి సమయం అని భావించిన నిందితుడు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొంతసేపటికి బాధితురాలు అరుపులు విని అక్క పరుగున వచ్చింది. బాధితురాలని రక్షించింది.

Read Also:Cm Kcr: భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

ఈ ఘటనపై కొత్వాలి షహర్‌ ఎస్‌హెచ్‌వో సంజయ్‌కుమార్‌ తోమర్‌ కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Exit mobile version