Site icon NTV Telugu

Suma Adda :సుమ అడ్డాలో ’90s ఏ మిడిల్ క్లాస్’ ఫ్యామిలీ సందడి..

Whatsapp Image 2024 01 10 At 4.45.14 Pm

Whatsapp Image 2024 01 10 At 4.45.14 Pm

ఓటీటీ లు వచ్చాక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ లభిస్తుంది.భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఎంతగానో అలరిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ వెబ్ సిరీస్ కు క్రేజ్ మరింత పెరిగిపోతుంది.. రీసెంట్ గా అలా వచ్చిన ’90s ఏ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ కు ప్రేక్షకులలో ఆదరణ పెరిగిపోతుంది.బిజీ బిజీ లైఫ్ లో పరుగులు తీస్తున్న నేటి తరానికి వెనక్కి తీసుకెళ్లి 90లోని మధుర జ్ఞాపకాలను కళ్లముందుకు తీసుకువస్తోంది ఈ ’90s ఏ మిడిల్ క్లాస్’ బయోపిక్.ప్రస్తుతం 90s కిడ్స్ మరియు 2k కిడ్స్ అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వస్తున్న ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ 90s కిడ్స్ ను ఓ పదిహేనేళ్లు వెనక్కి తీసుకెళ్లి వారి స్కూల్ డేస్ ను గుర్తు చేస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మరియు 90s కిడ్స్ ఈ వెబ్ సిరీస్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. అలా ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా ఓటీటీకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది.

మూవీ లవర్స్ అంతా ప్రస్తుతం 90s ఏ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ గురించే మాట్లాడుకుంటారు. అంతగా విజయం సాధించిన ఈ వెబ్ సిరీస్ ప్రధాన పాత్రలు తాజాగా ఓ షో లో సందడి చేశాయి. యాంకర్ సుమ నిర్వహిస్తున్న ప్రముఖ షో సుమా అడ్డాలో నటుడు శివాజి, నటి వాసుకి, చైల్డ్ ఆర్టిస్ట్లు అనందం, మౌలి మరియు రోహన్లు పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో సుమతో కలిసి శివాజి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.ప్రోమో ప్రారంభంలోనే ఎప్పటిలాగే సుమ తన వయసుని కవర్ చేసుకునే ప్రయత్నం చేయగా.. శివాజీ తనదైన శైలిలో పంచ్ లు విసిరాడు. “నేను అప్పటి జనరేషన్ కాకపోయినా.. 90s ఏ మిడిల్ క్లాస్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందంటూ చెప్పుకురాగా.. అదే.. మీరు మా కంటే ముందు జనరేషన్ వారు అయినా.. అని నేను అనను” అంటూ సుమకు పంచ్ వేసాడు.అంతలో శివాజీకి ఫోన్ రాగా.. పల్లవి ప్రశాంత్ అంటూ సుమ శివాజిని ఆట పట్టించింది. ఇలా ప్రొమో మొత్తం సంక్రాంతి పండుగ థీమ్ నేపథ్యంలో సాగింది.

Exit mobile version