Death mystery: మిస్ అయింది ఒక రాష్ట్రంలో.. డెడ్‌బాడీ దొరికింది మరో రాష్ట్రంలో.. అసలేమైంది?
- ఇంకా మిస్టరీగానే మధ్యప్రదేశ్ బీజేపీ నేత మమత మరణం..!
- మిస్ అయింది ఒక రాష్ట్రంలో.. డెడ్‌బాడీ దొరికింది మరో రాష్ట్రంలో....!
- సీబీఐ దర్యాప్తు చేయాలన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ఒక బీజేపీ నాయకురాలు.. అనుమానాస్పద స్థితిలో మరణించింది. దాదాపు తొమ్మిది నెలలైంది. కానీ ఆమె ఎలా చనిపోయింది. ఎవరైనా చంపారా? కేసు పురోగతి ఏంటి? ఇవేమీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. దీంతో ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఆమె ఎలా అదృశ్యమైంది? ఎక్కడ చనిపోయింది. అసలేం జరిగిందో.. ఇదంతా తెలియాలంటే ఈ వార్త చదవండి.
మమతా యాదవ్.. మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు. అనుమానాస్పద స్థితిలో మరణించి తొమ్మిది నెలలైంది. టాటూ వేయబడిన మమతా యాదవ్ మృతదేహం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో లభ్యమైంది. కానీ మమతా యాదవ్ మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు ఇంకా పోలీసులు అప్పగించలేదు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించలేదు. రెండు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగాల మధ్య దర్యాప్తు చిక్కుకుంది. మమతను హిందూ సంప్రదాయాల ప్రకారం దహనం చేయాలనుకుంటున్నామని పోలీసులు తెలిపినా అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆమెను గౌరవప్రదంగా నిర్వహించాలనుకుంటున్నామని ఆమె తల్లి రైనా బాయి చెప్పింది.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!

మమతా యాదవ్ సెప్టెంబర్ 11, 2023న కనిపించకుండా పోయింది . పరిచయస్తుడి నుంచి రూ. 7 లక్షలు రికవరీ చేయడానికి తాను ప్రయాగ్‌రాజ్‌కి వెళ్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. ఆమె చివరిసారిగా సెప్టెంబర్ 21న తన సోదరుడితో మాట్లాడింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దర్యాప్తు కూడా సరిగ్గా చేయలేదని వాపోయారు.
ఇక ఫిబ్రవరిలో మమత సోదరుడు రాజ్‌భాన్‌ను పోలీసులు ప్రయాగ్‌రాజ్‌కి పిలిచారు. మృతదేహాన్ని సెప్టెంబర్ 26, 2023న మమత మృతదేహంగా సోదరుడు గుర్తించిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులు పాతిపెట్టారు.
ఇదిలా ఉంటే తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందే మమత చెప్పిందని సోదరుడు రాజ్‌ఖాన్ తెలిపారు. తన సోదరి ఫోన్లో మాట్లాడిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయాడు. పోలీసులు ఏ మాత్రం సహకరించలేదన్నాడు. తన సోదరి దగ్గర రాజకీయ నాయకుల కీలక సమాచారం పెన్‌డ్రైవ్‌లో ఉందని చెప్పుకొచ్చాడు. ఆ కారణంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలతోనే మమత చనిపోయిందని సోదరుడు ఆరోపించాడు.
మమత మృతదేహాన్ని ప్రయాగ్‌రాజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని.. దర్యాప్తు చేయడం వారి బాధ్యత అన్నారు. వారికి అన్ని ఆధారాలను అందజేసినట్లు అశోక్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ జైన్ తెలిపారు.
ఇదిలా ఉంటే బీజేపీ నేత మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ కేసును ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) లేదా ఎస్టిఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ మేరకు డిజిపి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)కి లేఖ రాశారు. ఇది సామాన్యమైన విషయం కాదని.. బీజేపీ హత్యపై సీబీఐ దర్యా్ప్తు జరగాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన కుట్ర సిద్ధాంతాలను బీజేపీ కొట్టిపారేసింది.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!