Site icon NTV Telugu

Nitin Gadkari: 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుకు: నితిన్ గడ్కరీ

Nitin Gadkari

Nitin Gadkari

15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వాహనాలు, రవాణా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని బస్సులను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నారు. వాటి రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయబడతాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ పాలసీ కింద తొమ్మిది లక్షలకుపైగా ప్రభుత్వ వాహనాలు ఏప్రిల్‌ 1 నుంచి తుక్కుగా పరిగణించబడతాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కొత్త వాహనాలు వస్తాయని చెప్పారు. పరిశ్రమల సంస్థ ‘ఫిక్కీ'( FICCI) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.

Murali Vijay: క్రికెట్‌కు మురళీ విజయ్ గుడ్‌బై.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్

“15 ఏళ్లు దాటిన తొమ్మిది లక్షలకు పైగా ప్రభుత్వ వాహనాలను స్క్రాప్(Vehicle Scrapping) చేసేందుకు ఆమోదించాం. దీంతో కాలుష్యకారక బస్సులు, కార్లు పక్కకెళ్లిపోతాయి. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కొత్త వాహనాలు వస్తాయి. ఫలితంగా వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది” అని తెలిపారు. ఇథనాల్, మిథనాల్, బయో- సీఎన్‌జీ, బయో- ఎల్‌ఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రాథమిక రిజిస్ట్రేషన్‌ నమోదై 15 ఏళ్లు పూర్తయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను వదిలించుకోవాలి. వాటిని చట్టప్రకారం రిజిస్టరైన వాహన తుక్కు పరిశ్రమలకు తరలించాలి’ అని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సైన్యం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది.

Adani FPO: ఇప్పుడున్న పరిస్థితుల్లో అదానీ ‘ఆఫర్‌’ సక్సెస్ అవుతుందా?

Exit mobile version