8th Pay Commission : కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచింది. ఆ తర్వాత ఉద్యోగుల జీతం పెరిగింది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పే కమిషన్(8వ వేతన సంఘం)ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత 2024 సంవత్సరంలో ఉద్యోగుల జీతంలో భారీ పెంపుదల ఉండబోతోంది.
కొత్త పే కమీషన్ పని ఎప్పుడు జరుగుతుంది?
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల తర్వాతే కొత్త వేతన సంఘంపై కసరత్తు జరగనుంది. ప్రస్తుతం కొత్త వేతన సంఘం విషయంలో ఎంప్లాయిస్ యూనియన్ తరపున దేశవ్యాప్తంగా ఉద్యమం సాగుతోంది. బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఎనిమిదో వేతన సంఘం గురించి ఎటువంటి చర్చ లేదు. దీనిపై పార్లమెంట్‌లో కూడా చర్చ నడుస్తోంది
4వ వేతన సంఘం ద్వారా పెరిగిన వేతనం
జీతం పెరుగుదల – 27.6%
కనీస వేతనం – రూ 750
5వ వేతన సంఘం ద్వారా..
జీతం పెరుగుదల – 31%
కనీస వేతనం – రూ 2,550
6వ వేతన సంఘం ద్వారా..
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ – 1.86 సార్లు
జీతం పెరుగుదల – 54 శాతం
కనీస వేతనం – రూ. 7,000
7వ వేతన సంఘం ద్వారా..
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ – 3.68 రెట్లు సాధ్యం
జీతం పెరుగుదల – 44.44%
కనీస జీతం – రూ 26000 సాధ్యమే
2024 సంవత్సరం చివరిలో ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చని.. 2026 సంవత్సరంలో ఇది అమలు చేయబడుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే కేంద్ర ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. 7వ వేతన సంఘంతో పోలిస్తే ఇందులో భారీ మార్పులు ఉండొచ్చు. సుమారు 10 సంవత్సరాల తర్వాత పే కమిషన్‌లో మార్పు జరగనుంది. ప్రభుత్వం గతంలో పార్లమెంటులో సమాచారం ఇచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దాని ప్రస్తావన లేదని పేర్కొంది. దీన్ని లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఖండించారు. కొత్త పే కమీషన్ గురించి ప్రభుత్వం ఆలోచిస్తే 2024 సంవత్సరం సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు.