NTV Telugu Site icon

Fish : మొసలిని చంపిన చేప.. దాని శరీరంలో ఏకంగా 860 ఓల్ట్ ల కరెంట్

New Project (90)

New Project (90)

Fish : మొసలి చిత్తడి నేలలు, నదులలో ఒక క్రూరమైన జల జంతువు. మొసలి ఉన్న కుంట వైపు వెళ్లేందుకు కూడా ప్రజలు భయపడుతారు. ఎక్కడ నక్కి దాడి చేస్తుందో ఎవరికీ తెలియదు. బురద దాని శరీరం ఒకే రంగులో ఉంటాయి. నదిలోని పెద్ద చేపలను సైతం ఇది దాడి చేసి తింటుంది. కానీ ఈ వేట కొన్నిసార్లు దానికి కూడా ప్రమాదం కలిగిస్తుంది. ఎందుకంటే నదుల్లో ఎలక్ట్రిక్ ఈల్స్ కూడా ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే వాటిని పట్టుకుంటే కరెంటు షాక్ తగులుతుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ జీవి తన శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఈ ఏర్పాటును కలిగి ఉంది. ఇప్పుడు మొసలి, ఎలక్ట్రిక్ ఈల్ మధ్య జరిగిన ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:Shikhar Dhawan Retirement: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన గబ్బర్..

ఈ వీడియోలో చెరువు ఒడ్డున మొసలి ఉంది. దానికి దగ్గరగా ఈల్ వచ్చింది. ఈల్ ఒడ్డుకు వస్తుండగా మొసలి దాడి చేసి దవడలతో పట్టుకుంది. ఆ తర్వాత జరిగిన దృశ్యం షాకింగ్‌గా మారింది. ఎందుకంటే ఈల్ వారి శరీరంలో 860 వోల్ట్ల వరకు కరెంట్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కరెంట్ ను ఇతర చిన్న చేపలను చంపడానికి ఉపయోగించడంతో పాటు, ఈల్ తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగిస్తుంది. మొసలి ఈల్‌ను పట్టుకున్నప్పుడు, కరెంట్ షాక్ మొసలి శరీరానికి తగిలి వణుకుతుంది. ఈ వీడియోలో మొసలి నొప్పిని తట్టుకోలేక నొప్పితో కుంగిపోయి చనిపోయింది. మొసలి శక్తివంతమైన విద్యుత్ షాక్‌కు గురికావడంతో అది చనిపోయింది. ఆ సమయంలో మొసలి దవడలకు చిక్కిన ఈల్ కూడా చనిపోయింది. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ఎలక్ట్రిక్ ఈల్ ఒక ప్రాణాంతక చేప. ఇది 860 వోల్టుల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ చేపను పట్టేందుకు వెళ్లిన పలువురు విద్యుదాఘాతంతో మృతి చెందారు. చాలా మంది సత్తువ కోల్పోయి మంచానికి పరిమితం అయ్యారు.

Read Also:Congress: టీపీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణపై త్వరలోనే అధికారిక ప్రకటన