Site icon NTV Telugu

Fire On Birthday Party: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి

Firing

Firing

Open Fire On Birthday Party: దక్షిణాఫ్రికాలో బర్త్‌డే వేడుకల్లో కాల్పులు కలకలం రేపాయి. ఓ టౌన్‌షిప్‌లో వారాంతంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమూహంపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు.

పోర్ట్ ఎలిజబెత్‌లోని దక్షిణ ఓడరేవు నగరమైన గ్కెబెర్హాలో ఆదివారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లో బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్న వారిపై కాల్పులు జరిపారని పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. గుర్తు తెలియని ముష్కరులు వారిపై యాదృచ్ఛికంగా కాల్పులు జరిపారని.. వారికి మృతి చెందిన వాళ్లతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు. 8 మంది చనిపోయారని..మరో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారని.. మరణించిన వారిలో ఇంటి యజమాని కూడా ఉన్నాడని చెప్పారు.

Acid Attack: లేట్ ఎందుకు అయింది.. ఇంటికొచ్చిన భర్తపై యాసిడ్ పోసిన భార్య

దాడిపై దర్యాప్తు ప్రారంభించామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. సామూహిక హింస, మద్యం కారణంగా ప్రపంచంలోనే అత్యధిక హత్యలు జరుగుతున్న దక్షిణాఫ్రికాలో కాల్పులు సర్వసాధారణం. దక్షిణాఫ్రికాలో గత సంవత్సరం పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లోని వేర్వేరు బార్‌లలో జరిగిన కాల్పుల్లో 24 మంది చనిపోయారు.

Exit mobile version