Site icon NTV Telugu

Russia-Ukraine war: ఉక్రెయిన్పై రష్యా క్షిపణులతో దాడి.. 8 మంది మృతి

Russia

Russia

ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కీవ్‌ పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. శుక్రవారం నాడు అర్థ రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, రష్యా 32 ఇరాన్‌ తయారీ షహీద్‌ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్‌ మిస్సైళ్లను కూల్చి వేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే, తాజా దాడులపై రష్యా మిలటరీ ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు.

Read Also: Tamil Nadu CM: దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు ఈసారి బీజేపీకి ఓట్లు వేయరు..

ఇక, షెవ్‌చెంకివ్‌స్కీ జిల్లాలో రాత్రిపూట జరిగిన దాడిలో శనివారం ఉదయం నాటికి ఆరుగురు మరణించారని, 10 మంది గాయపడ్డారని ఖార్కివ్ మేయర్ ఇహోర్ తెరెఖోవ్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో తెలిపారు. ఆ తర్వాత మృతుల సంఖ్య 8కి పెరిగింది. అలాగే, ఈ దాడి జరిగిన తర్వాత అక్కడికి ప్రాంతీయ అధికారులు సహాయక చర్యలు కొనసాగించారు. ఉక్రెయిన్ స్థానిక అధికారులు, పోలీసులు ఖార్కీవ్ నగర వీధుల్లో తీవ్రంగా ధ్వంసమైన భవనాల పక్కన మండుతున్న మంటల ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. గత 20 నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతునే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version