Site icon NTV Telugu

YouTube: యూట్యూబ్‎తో రూ.6,800కోట్లు, 7లక్షల ఉద్యోగాలు ‎

YouTube: భారత జీడీపీలో యూట్యూబ్ వాటా ఏడాదికి రూ.6,800 కోట్లుగా ఉన్నట్లు ఆ సంస్థ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ తెలిపారు. ఏడాదికి సుమారు 7 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ‘భారత్‌లో క్రియేటర్ ఎకానమీ బాగా పెరుగుతోంది. దేశంలోని ప్రముఖ భాషలన్నీ మా ప్లాట్ ఫాం మీద ఉన్నాయి. జెండర్ డైవర్సిటీ కూడా ఉంది. కంటెంట్ తయారు చేసే వారు, దాన్ని యూజ్ చేసుకునే వారికి యూట్యూబ్ ఒక సురక్షితమైన ప్లేస్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని నీల్ మోహన్ వివరించారు.

Read Also: Azam Khan: అతిగా ఆవేశపడ్డాడు.. ఇప్పుడు జైలుకు వెళ్తున్నాడు

యూట్యూబ్ స్థానిక సృష్టికర్తలతో దేశీయ ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. ఈ మేరకు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో యూట్యూబ్ చీఫ్ ప్రొడెక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ మాట్లాడారు. ’భారతదేశంలో క్రియేటర్ ఎకానమీ నిజంగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు రూ.6800కోట్లు ఉత్పత్తి చేస్తోంది. 7లక్షల ఉద్యోగాలను సృష్టిస్తోంది’ అన్నారు. క్రియేటివిటీ సక్సెస్ తో పాటు లింగ వైవిధ్యం పరంగా ఈ వేదికలలో అన్ని భారతీయ భాషలను కలిగి ఉన్నామన్నారు. కంటెంట్ సృష్టికర్తలు దేశ వ్యాప్తంగా ఉండే మొదటి ప్రాంతం యూట్యూబ్ అని చెప్పారు. యూట్యూబ్ కమ్యూనిటీలపై ప్రధాన దృష్టి పెట్టిందని తెలిపారు. అంతర్జాతీయ కమ్యూనిటీకి తగినట్లుగా మార్గదర్శకాల ప్రకారం తప్పుడు సమాచారం, విద్వేషం యూట్యూబ్ లో అనుమతించబోమని స్పష్టం చేశారు.

Read Also: Bharat Jodo Yatra: 50 రోజుల్లో 5 రాష్ట్రాలు… 50వ రోజు 26 కిలో మీటర్లు

Exit mobile version