NTV Telugu Site icon

Bharateeyudu 3: అబ్బే ఇప్పట్లో లేనట్టే!!

Bharathiyudu 2

Bharathiyudu 2

స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “భారతీయుడు 2”. దర్శకుడు శంకర్ చాలా హైప్ తెచ్చి రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర ఆకట్టుకోలేక పోయింది. అంతే కాదు సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది ట్రోల్ చేసేలా ఉందంటే పరిస్థితి ఇక ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విఫలం కావడమే కాకుండా.. శంకర్ ఓల్డ్ స్కూల్ ఆలోచనలపై భారీ విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతీయుడు- 2 సినిమా ప్రమోషన్స్ లో కూడా భారతీయుడు- 3 సినిమాని మరో ఆరు నెలలలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమా దెబ్బకు ఆ మూడో భాగాన్ని రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది.

Read Also: Rajya Sabha: రాజ్యసభ చైర్మన్‌పై ‘‘అభిశంసన తీర్మానాని’’కి విపక్షాల ప్లాన్.. ధంఖర్-జయా బచ్చన్ గొడవే కారణం..

శంకర్‌ రీ వర్క్ చేసి ఆ చిత్రాన్ని మెరుగుపరచడానికి లైకా ప్రొడక్షన్స్ “భారతీయుడు 3” విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శంకర్ “భారతీయుడు 2”, “భారతీయుడు 3” రెండింటినీ ఒకేసారి చిత్రీకరించారు. “భారతీయుడు 3″ని 2025 సంక్రాంతికి విడుదల చేయాలనేది ముందు ఆలోచన. రెండవ భాగం విజయవంతమైతే.. మూడవ భాగంపై క్రేజ్ భారీగా ఉండేది. కానీ ఇప్పుడు, ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. అయితే భారతీయుడు 2 కంటే భారతీయుడు 3 బాగుంటుందని కమల్ హాసన్ ముందు నుంచి చెబుతున్నారు. ఇప్పటికీ మూడవ భాగం ఆకట్టుకునేలా రివర్టింగ్‌గా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

Read Also: Hit and run: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్ కేసు.. కారు ఢీకొని యువకుడి మృతి

Show comments