Site icon NTV Telugu

Earthquake: జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు

Japan

Japan

నైరుతి జపాన్‌లో భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. యువాజిమాకు పశ్చిమాన 18 కిలోమీటర్లు లోతులో క్యుషు-షికోకు దీవుల దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలాగే దక్షిణ జపాన్‌లోని ఎహైమ్, కొచ్చి ప్రిఫెక్చర్లలో కూడా భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

ఇది కూడా చదవండి: Delhi HC: లవ్ ఫెయిల్యూర్‌తో ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే, మహిళను బాధ్యులు చేయలేము..

అయితే స్థానిక మీడియా కథనాలు ప్రకారం ఇప్పటి వరకూ ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని పేర్కొన్నాయి. ఎహైమ్ ప్రిఫెక్చర్‌లోని ఇకాటా అణు కర్మాగారంలో ఒక రియాక్టర్ పని చేస్తోంది. ఎటువంటి అవకతవకలు జరగలేదని పేర్కొంది. ప్రపంచంలో అత్యంత అరుదుగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో జపాన్ ఒకటి. జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం. ప్రపంచంలో 6 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో ఐదో వంతు జపాన్‌లోనే ఎక్కువగా జరుగుతుంటాయి.

ఇది కూడా చదవండి: Ghulam Nabi Azad: ఆజాద్ కీలక నిర్ణయం.. నామినేషన్ ఉపసంహరణ.. కారణమిదే!

ప్రస్తుతం 6.3 తీవ్రత భూప్రకంపనలు జరిగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. దీనిపై అధికారుల నుంచి కూడా క్లారిటీ రాలేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయలేదు. అప్రమత్తమైన అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ghulam Nabi Azad: ఆజాద్ కీలక నిర్ణయం.. నామినేషన్ ఉపసంహరణ.. కారణమిదే!

 

Exit mobile version