Site icon NTV Telugu

Kamareddy: కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

Kamareddy

Kamareddy

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తీవ్ర కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి ఏకంగా 58 మంది అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లా బాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన బాధితులు అనారోగ్యానికి గురయ్యారు. కల్తీ కల్లు ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తుండడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి కల్లు బాధితులను తరలించారు. అక్కడ వైద్యులు చికిత్సను ప్రారంభించారు.

కల్తీ కల్లు బాధితుల్లో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. కల్తీ కల్లు ఘటనతో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం ఆయా గ్రామాలకు వెళ్లింది. కల్లు దుకాణాల్లో శాంపిల్స్ సేకరించారు ఎక్సైజ్ అధికారులు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. కల్లు దుకాణాల లైసెన్స్ లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version