Site icon NTV Telugu

Amitabh Bachchan: బిగ్ బీని ఆశ్చర్యపరిచిన ఐదేళ్ల పిల్లవాడు.. ఎందుకో తెలుసా?

Amitabh Bachan

Amitabh Bachan

Amitabh Bachchan: నటుడు అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత బ్లాగ్‌లో చాలా ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆయన తన జీవితంలో జరిగిన సరదా సన్నివేశాలను, జీవిత పాఠాలను వివరిస్తూ ఉంటారు. ఆయన రచనల కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఇటీవల ఓ ఐదేళ్ల పిల్లవాడితో జరిగిన సరదా సన్నివేశాన్ని తన బ్లాగ్‌లో పంచుకున్నారు. బచ్చన్ ఓ సారి ఓ ప్రచార ప్రకటన కోసం షూటింగ్ చేస్తుండగా.. ఓ పిల్లవాడు తనను కలిశాడని తెలిపారు. అనంతరం ఆ పిల్లవాడు అమితాబ్‌ బచ్చన్‌ను వయస్సు గురించి అడిగాడంట. బిగ్‌ బీ వయస్సు చెప్పడంతో విన్న ఆ పిల్లవాడి నుంచి వచ్చిన సమాధానం అమితాబ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. “ఇంకా ఎందుకు పని చేస్తున్నావు?.. ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చుగా..” అని ఆ పిల్లవాడు అనడంతో బచ్చన్ ఆశ్చర్యపోయారు.

బిగ్ బీ ఇలా రాశారు. ‘క్షమించండి, మీ వయస్సు ఎంత?’ నేను ’80’ అన్నాను ! అతను వెనక్కి తిరిగి ‘ అయ్యో! అలా ఎందుకు పని చేస్తున్నావు? మా తాతలు ఇంట్లో కూర్చుని చల్లగా ఉన్నారు .. మీరు కూడా అలా చేయాలి..!!” అని పిల్లవాడితో జరిగిన సంభాషణను బచ్చన్ రాసుకొచ్చారు. బచ్చన్ ఇంకా ఇలా రాశారు , “ఆ పిల్లవాడు అన్న మాటలకు నా దగ్గర సమాధానం లేదు .. నిజంగా చెప్పాలంటే ఆ ఐదేళ్ల పిల్లాడి నిజాయితీని చూసి నేను ఆశ్చర్యపోయాను!.. రెండవది, నా దగ్గర సమాధానం లేదు!” అని బచ్చన్ తన బ్లాగ్‌లో రాశారు. షూట్ ముగింపులో అతనికి వీడ్కోలు చెప్పానని.. ఆ పిల్లవాడి తల్లి ప్రోద్బలంతో అతనికి ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్లిపోయానని ఆయన తన బ్లాగ్‌లో తెలిపారు.

Karthikeya 2: మధుర ఇస్కాన్ టెంపుల్ లో ‘కార్తికేయ 2’ చిత్రబృందం సందడి!

బిగ్ బీ త్వరలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా తిరిగి రానున్నారు. మంగళవారం ఆయన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సెట్స్‌లో పైజామాలో ఉన్న ఓ ఫొటోను ఆయన విడుదల చేశారు. సినిమాల విషయానికి వస్తే, ఆయన తదుపరి అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’లో కనిపించనున్నారు. ఇందులో అలియా భట్, రణబీర్ కపూర్, నాగార్జున కూడా నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9, 2022న విడుదల కానుంది.ఆయన వికాస్ బహ్ల్ ‘గుడ్‌బై’లో కూడా భాగమయ్యారు. ఇందులో ఆయన భాస్కర్ ప్రజాపతి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌తో పాటు రష్మిక మందన్న, నీనా గుప్తాలు కూడా నటిస్తున్నారు. అతను ‘ది ఇంటర్న్’ రీమేక్, ‘ప్రాజెక్ట్ కె’ కోసం దీపికా పదుకొణెతో కలిసి నటిస్తున్నారు. అంతే కాకుండా, పరిణీతి చోప్రా, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ నటించిన తన రాబోయే ప్రాజెక్ట్ ‘ఉంచై’ కోసం బిగ్ బి తన షూట్‌ను కూడా ముగించుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.

Exit mobile version