NTV Telugu Site icon

Heavy Weight Girl: వయసు 5ఏళ్లు.. బరువు 45కిలోలు.. తిండి పెట్టలేక తాళం

Girl

Girl

Heavy Weight Girl: పాప వయసు 5ఏళ్లు.. బరువు మాత్రం 45కిలోలు. ఆ పాప సాధారణం కంటే చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటుంది. ఎంత తిన్న తర్వాత కూడా తాను ఆకలితో అలమటిస్తూనే ఉంటుంది. దీంతో ఆ పాప తల్లి వంటగదికి తాళం వేయవలసి వచ్చింది. కారణం.. అప్పుడైనా తన కుమార్తె ఎక్కువ తినలేదని ఆ తల్లి ఆలోచన. వివరాల్లోకి వెళితే. యూకేలో నివసిస్తున్న 25 ఏళ్ల హోలీ విలియమ్స్ కుమార్తె హార్లో అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి పేరు ప్రేడర్ విల్లీ సిండ్రోమ్. దీని కారణంగా, 5 ఏళ్ల హార్లో సుమారు 45 కిలోల బరువు పెరిగింది. హార్లో ఎంత తిన్నా మళ్లీ ఆకలితో ఉంటుంది. ఎప్పుడూ తినాలనే అనిపిస్తోంది తనకు. ఇలా బాలిక బరువు పెరగడానికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు.

హార్లో ఆకలిని నియంత్రించే క్రోమోజోమ్ కలిగి లేదని వైద్యులు చెప్పారు. ఈ అరుదైన వ్యాధి వల్ల ఎంత తిన్నా కడుపు నిండదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది అరుదైన జన్యుపరమైన వ్యాధి.. యూకేలో జన్మించిన ప్రతి 15,000 మంది పిల్లలలో ఒకరిలో కనిపిస్తుంది. దీనికి నివారణ లేదు. ముందుజాగ్రత్త ఒక్కటే రక్షణ. దీనికి సంబంధించి పీడియాట్రిక్స్ జర్నల్‌లో రీసెర్చ్ పేపర్ ఇటీవల ప్రచురితమైంది. స్థూలకాయంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని.. ఇందులో 6 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని తెలిపారు. దీని వెనుక చెడు ఆహారమే కారణమని చెప్పారు.

Read Also: Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‎కు గురైన ఓనర్