Site icon NTV Telugu

Truck Rams into Tea Shop: టీ దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం

Truck Accident

Truck Accident

Truck Rams into Tea Shop: తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో సిమెంట్ బస్తాలను తీసుకెళ్తున్న ట్రక్కు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. సమీపంలో ఆగి ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు. మరో19 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

Read Also: Hyderabad Gold ATM: అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో గోల్డ్ ATM.. ఎన్ని గ్రాములు కొనచ్చంటే?

పలువురు శబరిమల ఆలయ యాత్రికులు దుకాణం వద్ద టీ తాగుతుండగా వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టీ దుకాణం సమీపంలో పార్క్ చేసిన కారు, ఇతర ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రాథమిక విచారణ ఆధారంగా, సిమెంట్ ట్రక్కు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ట్రక్కు అరియలూరు నుంచి శివగంగై వెళ్తోంది. పోలీసుల తదుపరి విచారణ కొనసాగుతోంది.

Exit mobile version