Earthquake: అస్సాంలోని గువాహటిలో 5.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర బెంగాల్, పొరుగున ఉన్న భూటాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం కొద్ది రోజుల క్రితమే.. అంటే సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో కూడిన మరో భూకంపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సంభవించింది.
రోజూ సూర్య నమస్కారం చెయ్యడంతో ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి అని తెలుసా..
ప్రస్తుతానికి, ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. అయినప్పటికీ, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
