Site icon NTV Telugu

Earthquake In Kolkata: వణికిన కోల్‌కతా.. బంగ్లాదేశ్‌ కేంద్రంగా 5.4 తీవ్రతతో భూకంపం!

Earthquake

Earthquake

Earthquake In Kolkata: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ప్రభావం నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించింది. అధికారుల సమాచారం ప్రకారం భూకంప కేంద్రం పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో నమోదైంది. మధ్యాహ్నం 1.22 గంటల సమయంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

360° స్పేషల్ ఆడియో, బోస్ సౌండ్ టెక్నాలజీతో ప్రీమియం ఆడియో అనుభవం.. Noise Master Buds 2 లాంచ్.!

భూకంప ప్రకంపనలు తక్కువ సమయమే ఉన్నప్పటికీ.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో పలువురు తమ ఇళ్లలో ఫ్యాన్లు, ఫర్నిచర్ కంపించాయని పోస్టులు పెట్టారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ నెలలో భూకంపం కోల్‌కతా నగరాన్ని రెండోసారి వణికించింది. ఫిబ్రవరి 3న కూడా స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో భూకంప కేంద్రం మయాన్మార్ లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రకంపనలు కూడా కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో అనుభూతి అయ్యాయి.

Vijay-Rashmika Love Journey: పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం.. విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే!

యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) సమాచారం ప్రకారం, ఈ భూకంపం మయన్మార్‌లోని అక్యాబ్‌కు తూర్పు దిశగా సుమారు 70 మైళ్ల దూరంలో నమోదైంది. అలాగే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం భూమి ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్‌ లోని పలు ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్‌ లోనూ ఈ ప్రకంపనలు అనుభూతి అయ్యాయి. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

Exit mobile version