NTV Telugu Site icon

Yemen: యెమెన్‌లో విషాదం.. పడవ బోల్తా.. 49 మంది మృతి

Boat

Boat

యెమెన్ సమీపంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 49 మంది మృతిచెందారు. మరో 140 మంది తప్పిపోయారు. ఈ మేరకు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) తెలిపింది. దాదాపు 260 మంది సోమాలియాలు, ఇథియోపియన్‌లతో గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా పడవ వెళ్తుండగా సోమవారం మునిగిపోయినట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్ చేసి 71 మందిని రక్షించారు.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణకు స‌మాచార క‌మిష‌న‌ర్లు.. ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

ఆఫ్రికాలో పేదరికం నుంచి తప్పించుకోవడానికి మరియు పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి వలసదారులు ప్రయత్నిస్తుంటారు. అలా వలసదారులు యెమెన్ మీదగా తరచుగా వెళ్లే మార్గాలలో ఒకటి. యెమెన్ ఒక దశాబ్దానికి పైగా రక్తపాత అంతర్యుద్ధంలో మునిగిపోయింది.

ఇది కూడా చదవండి: Rainy Season : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈ నియమాలు పాటించండి

Show comments