NTV Telugu Site icon

Hawala Money: బేగంబజార్ లో భారీగా హవాలా నగదు సీజ్

Hawala Bazar

Hawala Bazar

హైదరాబాద్ లో హవాలా నగదు గుట్టలుగుట్టలుగా దొరుకుతోంది. టాస్క్ ఫోర్స్‌ పోలీసుల తనిఖీలో లక్షలు పట్టుబడుతున్నాయి. బేగంబజార్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. కేవల రామ్ అనే హవాలా వ్యాపారి వద్ద రూ.48 లక్షల 50 వేల నగదు పట్టుకున్నారు. నగదును , వ్యాపారిని బేగంబజార్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు…నగదును కోర్ట్ లో డిపాజిట్ చేసి, వ్యాపారికి నోటీసులు ఇచ్చారు బేగంబజార్ పోలీసులు.

ఇటీవల హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. చిట్యాల పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. టీఎస్ 10 EY 6160 నెంబర్ గల కియా కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో రూ.4 కోట్ల నగదు పట్టుబడింది. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పట్టుబడ్డ నగదు హవాలా మనీగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి చెన్నై తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Rishi Sunak meet Modi : మోదీ, రిషి సునాక్ భేటీ ముహూర్తం ఖరారు.. అప్పుడే దానిపై చర్చ

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టగా 70 లక్షల హవాలా మనీ సీజ్ చేశారు. వాహన తనిఖీలు చేస్తుండగా ఈ హవాలా మనీ పట్టుబడింది. పంజాగుట్ట నుండి సోమాజిగూడ మీదుగా వెళ్తున్న మార్గంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న 70 లక్షల నగదుతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అటు మునుగోడు ఉప ఎన్నిక వేళ రాజకీయపార్టీలు ఓటర్లకు తాయిలాలు పంచేందుకు భారీ ఎత్తున నగదును వివిధ రూపాల్లో తరలిస్తున్నారు.

గత కొన్ని రోజుల క్రితం రెండు రోజుల వ్యవధిలోనే రూ. 4 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కరోజే వెస్ట్ జోన్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రెండున్నర కోట్ల హవాలా నగదును సీజ్ చేశారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని.. జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. అంతకు ముందు రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ వెంకటగిరికాలనీలో రూ.54 లక్షల హవాలా నగదును సీజ్ చేశారు.

Read Also: Naresh- Pavitra: మరోసారి మీడియా ముందు పవిత్ర- నరేష్ రచ్చ.. అక్కడ చేతులు వేసి మరీ