Site icon NTV Telugu

Human Bodies: మెక్సికోలో భయానకం.. 45బ్యాగుల్లో మానవ శరీర భాగాలు

Mexico Police

Mexico Police

Human Bodies: ఈ మధ్య కాలంలో హత్యలు చేసి బాడీలను ముక్కలు ముక్కలుగా నరకడం ప్యాషనైపోయింది. చంపి బాడీ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో వేయడం ద్వారా నిందితులు నేరం నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా ఘటనలు మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. ప్రస్తుతం ఉత్తర అమెరికాలోని మెక్సికోలో అలాంటిదే అతి భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. వరుస మిస్సింగ్ కేసులపై విచారణ జరుపుతున్న పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. జాలిస్కో రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కు సమీపంలోని ఓ లోయలో 45 బ్యాగులు కంటపడ్డాయి. అందులో మానవ శరీర భాగాలు ఉండటంతో పోలీసులు, అధికారులు కంగుతిన్నారు. ఓ కాల్ సెంటర్‌లో పనిచేసే కొంత మంది యువతీ యువకులు వరుసగా కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా గాలింపు చేపట్టిన పోలీసులకు ఇలా శరీర భాగాలు ఉన్న బ్యాగులు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలని అధికారులు వెల్లడించారు. అయితే ఆ శరీరభాగాలు ఎవరివనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Read Also:Surgery : వైద్య చరిత్రలో మరో అద్భుతం.. 25నిమిషాల్లోనే వెన్నుముక ఆపరేషన్

స్థానికుల కథనం ప్రకారం.. జాలిస్కో ప్రాంతంలోని పారిశ్రామిక ప్రాంతమైన గ్వాడలజారా సమీపంలోని లోయలో 45 సంచుల్లో మానవ మృతదేహాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో శరీర భాగాలు ఒక పురుషుడు, స్త్రీకి చెందినవని ప్రకటించింది. మే 20న దాదాపు 30 ఏళ్ల వయసున్న ఏడుగురు యువతీ యువకులు అదృశ్యమయ్యారు. తప్పిపోయిన వారంతా ఒకే కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. వీరంతా తప్పిపోయినట్లు వేర్వేరు రోజుల్లో మిస్సింగ్ కేసులు పలు స్టేషన్లలో నమోదయ్యాయి. వారి మిస్సింగ్ కేసును పోలీసులు విచారించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాగులు దొరికిన ప్రాంతం బాధితులు పనిచేసే కాల్ సెంటర్ సమీపంలోనే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కాల్ సెంటర్‌పై పోలీసులు దృష్టి సారించారు. అక్కడ డ్రగ్స్, రక్తంతో తడిసిన వస్తువులతో పాటు కొన్ని డాక్యుమెంటరీలు కనిపించాయని స్థానిక మీడియా పేర్కొంది. ఆ బ్యాగుల్లో తప్పిపోయిన ఏడుగురు వ్యక్తులు ఉన్నారా? కాల్ సెంటర్‌లో ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపారు? తదితర విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Read Also:Honey Rose : నా బాడీ షేప్ గురించి వాడు నోటికి వచ్చినట్లు వాగుతుంటే.. నవ్వారు

Exit mobile version