NTV Telugu Site icon

PM Modi: కువైట్ మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం

Modi

Modi

కువైట్‌ అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘కువైట్ నగరంలో జరిగిన అగ్నిప్రమాదం బాధాకరం. నా ఆలోచనలు తమ సన్నిహితులను, ప్రియమైన వారిని కోల్పోయిన వారందరిపై ఉన్నాయి. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. బాధితులకు సహాయం చేయడానికి అక్కడి అధికారులతో కలిసి పని చేస్తోంది’’ అని మోడీ చెప్పారు.

 

కువైట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది భారతీయులు సజీవ దహనం అయ్యారు. పలువురు భారతీయులు గాయపడ్డారు. ఆరు అంతస్తుల భవనంలోని వంటగదిలో మంటలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. భవనంలో దాదాపు 160 మంది నివసిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. 43 మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భవనంలో కంపెనీకి చెందిన కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనం ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.