Site icon NTV Telugu

Football Stadium: ఆ స్టేడియాన్ని ఎక్కడికంటే అక్కడికి మడతపెట్టి తీసుకెళ్లొచ్చు

974

974

Football Stadium: అదొక ఫుట్ బాల్ స్టేడియం.. దీనిని ఎక్కడికంటే అక్కడికి మడత పెట్టేసి రవాణా చేసేయొచ్చు. హా.. అందులో ఏముంది. ఏదో చిన్న స్టేడియం అయివుంటుందిలే అనుకుంటున్నారా.. కాదంటి 40వేల మంది కూర్చొనే వీలున్న స్టేడియం. అంతేకాదు అది ఫిఫా వరల్డ్‌ కప్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. వాడేసిన షిప్పింగ్‌ కంటెయినర్‌లతో తయారు చేసిన దీనికి ‘స్టేడియం 974’ అని పేరుపెట్టారు. ఆ నంబరు ఎందుకు అంటే అది ఖతార్‌ ఐఎస్‌డీ కోడ్‌. అంతేకాదు 974 కంటెయినర్లతో అది తయారైంది. ఈ మొబైల్‌ స్టేడియంను విడగొట్టి ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు. వరల్డ్‌ కప్‌ తర్వాత దీనిని ముక్కలుగా విడదీసి వేరే చోటికి తరలిస్తారట.

స్టేడియం 974 సాధారణంగా కనిపిస్తున్నప్పటీకీ… దాని నిర్మాణ టెక్నిక్ అంతా బయటనుంచే ఉంది. దీనిని దోహా వాటర్‌ఫ్రంట్‌కు దగ్గరగా నిర్మించబడింది. ఇది ప్రపంచ కప్‌ కోసం మొట్టమొదటి సారిగా నిర్మించిన పూర్తి తాత్కాలిక స్టేడియం. ఫుట్‌బాల్ పూర్తయిన తర్వాత, ప్రపంచంలోని తక్కువ సంపన్న ప్రాంతాలలో కొత్త స్టేడియాలను నిర్మించేందుకు ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగపడుతోంది. చాలా మంది ఆర్కిటెక్ లు చాలాకాలం కష్ట పడి ప్రస్తుత స్టేడియానికి రూపునిచ్చారు. ఇక్కడ వందలాది షిప్పింగ్ కంటైనర్‌లను ఉపయోగించారు. సముద్రతీరంలో సెట్టింగ్ మాదిరి స్డేడియాన్ని నిర్మించారు. వీటిలో కొన్ని టాయిలెట్లు, వీఐపీ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత స్టేడియం 974 కచ్చితంగా మరపురాని నిర్మాణంగా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=rmzp8hZeMcE&t=20s&ab_channel=FootballTube

Exit mobile version