Site icon NTV Telugu

Minister KTR: కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబ‌స‌భ్యుల‌కు కేటీఆర్ ఓదార్పు

Minister Ktr

Minister Ktr

Minister KTR: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబ‌స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటన చాలా విషాదకరమని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలోనూ వీధికుక్కల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇందు కోసం జంతు సంరక్షణ కేంద్రాల‌ను, జంతు జ‌న‌న నియంత్రణ కేంద్రాల‌ను కూడా ఏర్పాటు చేశామ‌న్నారు. కుక్కల స్టెరిలైజేష‌న్ కోసం చ‌ర్యలు చేప‌డుతున్నామ‌ని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

Exit mobile version