Burqa Dance Video: కర్ణాటకలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ ఓ కార్యక్రమంలో బురఖాలు ధరించి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నలుగురు విద్యార్థులు ప్రముఖ బాలీవుడ్ పాటకు బురఖాలు ధరించి వేదిక డ్యాన్స్ చేశారు. అయితే ప్రేక్షకులు చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహపరిచారు. మంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించారు.
St.Joseph Engineering College, #Mangaluru @SJEC_Mangaluru has suspended students who danced in #Burqa on a Bollywood song. College says students from muslim community itself barged on stage during an event,enquiry hs been ordered. This Dance was not part of approved program. pic.twitter.com/incilomjUf
— Yasir Mushtaq (@path2shah) December 8, 2022
కళాశాల, ఒక ప్రకటనలో, విద్యార్థుల సంఘం ప్రారంభోత్సవంలో అనధికారిక భాగంగా స్టేజ్‌పైకి దూసుకెళ్లి ముస్లిం విద్యార్థులు చేసిన నృత్యం అని పేర్కొంది. దీనికి కళాశాల యాజమాన్యం నుంచి అనుమతి లేదని.. డ్యాన్స్ చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసిన దీనిపై విచారణ చేపట్టినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. కమ్యూనిటీలు, సామరస్యాన్ని దెబ్బతీసే ఏ కార్యకలాపాలకు కళాశాల మద్దతు ఇవ్వదు లేదా క్షమించదని పేర్కొంది.