New Festival: పండుగలకు మన దేశం ప్రసిద్ధి. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పండుగ జరుపుకుంటారు ప్రజలు. కానీ, మన దేశంలో కొత్త పండుగ ఉంది తెలుసా.. అదే కొరడాల పండగ. దాని ప్రత్యేకత ఏంటో ఓ సారి చూద్దాం.. జల్లికట్టు పండుగ తమిళనాడు ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. అదే రాష్ట్రంలో చాలామందికి తెలియని మరో ఫేమస్ ఫెస్టివల్ కొరడాల పండుగ. వందలాది మంది భక్తులు అమ్మవారిపై అభిమానంతో కొరడాలతో తమను తాము కొట్టుకుంటారు. కోయంబత్తూరులోని పూసరిపాళయం ప్రాంతంలో 300 ఏళ్ల నాటి అధికాలమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి ఏటా డిసెంబర్ నెలలో ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని దాదాపు పది రోజుల పాటు నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించి.. కొరడాలతో కొట్టుకుంటారు. దీనిని కొరడాల పండుగగా కూడా పిలుస్తారు. ఈ కొరడా దెబ్బలను హరతులుగా భావించి.. వాటి ద్వారా అమ్మవారి రుణం తీర్చుకుంటామని భక్తులు విశ్వాసం. కోయంబత్తూర్ టౌన్ హాల్‌కు చాలా సమీపంలో ఉండే అమ్మన్ ఆలయం ప్రవేశ ద్వారం వద్ద చాలా ఎత్తైన రాజగోపురం ఉంటుంది. ఈ ఆలయంలో దర్శనంవ చేసుకుంటే తెలియని అనుభూతి పొందుతారనేది ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఈ అమ్మన్ ఆలయం నది నుండి ఉద్భవించిందని పూర్వీకులు చెబుతారు.
New Festival: ఎంత బాదుకుంటే అంత భక్తి ఉన్నట్లు.. ఇదో కొత్త పండుగ ఎక్కడంటే

Whips Festival Coimbatore