NTV Telugu Site icon

Yarlagadda Venkata Rao: టీడీపీలోకి చేరిన 35 ఎస్సీ కుటుంబాలు, 5 ముస్లిం కుటుంబాలు..!

14

14

విజయవాడ రూరల్ మండలం పి. నైనవరం గ్రామానికి చెందిన వాలంటీర్ నత్త విజయ్ సాగర్ ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ధూళిపాళ్ల దేవేందర్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో వారి కార్యాలయంలో బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అదే గ్రామానికి చెందిన 35 ఎస్సీ కుటుంబాల నాయకులు, కార్యకర్తలు నత్త ఆనంద్ సాగర్, బొనిగె బుజ్జిబాబు, దోమ జోసఫ్, కంబ సామెల్, పైల కార్తీక్, బలవరపు రాజు, తానంకి వెంకటేశ్వరరావు, సిర శ్రీలక్ష్మి, బొనిగె సుప్రియ, దారం మరియమ్మ, కంచెర్ల రంగమ్మ, దోమ శాంతమ్మ, తానంకి నాగలక్ష్మి, పెయ్యల కృపావతి, కోట చంటి, ఇంజూరపు వరలక్ష్మి, నల్లమల్లి దేవమణి, మాలపల్లి సౌజన్య పార్టీలోకి చేరారు.

Also read: Maharashtra Crime: ప్రియుడు కోసం ఇద్దరు పిల్లలను చంపిన తల్లి..

అలాగే అదే ప్రాంతానికి చెందిన 5 ముస్లిం కుటుంబాలకు చెందిన షేక్ హుస్సేన్ పీరా, షేక్ అబ్దుల్లా, షేక్ నాయబ్ రసూల్, షేక్ అమినాబీ, షేక్ నూర్జహాన్, షేక్ కాసింబీ, షేక్ హస్సీనలు టీడీపీలో చేరారు. యార్లగడ్డ వెంకట్రావు వారికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also read: Karumuri Nageswara Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో ప్రజలు లేరు..

ఈ కార్యక్రమంలో పి. నైనవరం గ్రామ పార్టీ అధ్యక్షులు రాంపండు, పార్టీ కార్యదర్శి చప్పిడి రమేష్, విజయవాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు గొడ్డళ్ళ రామారావు, గ్రామ మాజీ సర్పంచి దావు కోటేశ్వరరావు, పోకల చిన్నబాబు, పోకల కోటయ్య, పోకల బాలాజీ, పోకల దుర్మారావు, పోతున రంగ, పొనుగుమాటి ఆనందరావు, బెజవాడ చంద్రబాబు, షేక్ నబీ, అంబాపురం సర్పంచి గండికోట సీతయ్య, క్లస్టర్ ఇంఛార్జి గుజ్జర్లపూడి బాబురావు, బొనిగె వెంకటేశ్వరరావు, గొడ్డళ్ళ సూరిబాబు, జనసేన గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.